ఆ రెంటిపై అనుకు చాలా ఆశలున్నట్లున్నాయి

0

పవన్ కళ్యాణ్.. బన్నీ.. నాని.. నాగచైతన్య వంటి స్టార్స్ తో నటించినా కూడా అను ఎమాన్యూల్ కెరీర్ గాడిన పడలేదు. ఆమె చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ అవ్వగా కొన్ని నిరాశ పర్చాయి. దాంతో ఆమె కెరీర్ పరంగా వెనక్కు ముందుకు అన్నట్లుగా ఊగిసలాడుతోంది. ఆమద్య దాదాపు ఏడాది పాటు పూర్తిగా కనుమరుగయిన అను మళ్లీ ఈమద్య రెండు సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలపై ఈమె కెరీర్ఆధారపడి ఉంది. ఈమె చేస్తున్న మొదటి సినిమా అల్లుడు అదుర్స్ రెండవది మహాసముద్రం.

ఈ రెండు సినిమాల్లో కూడా ఈమె మెయిన్ లీడ్ కాకపోవడం మైనస్. సెకండ్ లీడ్ అయినా కూడా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా మహాసముద్రంలోని పాత్ర ఇప్పటి వరకు తాను ఎప్పుడు కనిపించని విధంగా కనిపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. తాను చేస్తున్న ఈ రెండు సినిమాల తర్వాత కెరీర్ పరంగా బిజీ అవుతాను అంటూ నమ్మకంగా ఉంది. అయితే ఈ సినిమాలు ఈ అమ్మడికి ఎంతగా సక్సెస్ ను కట్టబెడతాయి అనేది చూడాలి.