ఉప్పెన బ్యూటీకి మరో ఆఫర్

0

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఉప్పెన సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా విడుదల ముందు నిలిచిపోయింది. సినిమా విడుదల కాకున్నా కూడా అందులో నటించిన కృతి శెట్టికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కు దక్కని అరుదైన అవకాశాలు ఈమెకు వస్తున్నాయి. తెలుగులో ఈమె నటించిన సినిమాలు ఒక్కటి అంటే ఒక్కటి కూడా విడుదల కాకున్నా కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఉప్పెన సినిమా పాటలు మరియు పోస్టర్ లతోనే మెప్పించిన కృతి శెట్టి ఇప్పటికే రెండు ఆఫర్లు దక్కించుకుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమాలో నానికి జోడీగా ఆఫర్ ను దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఎంపిక అయ్యింది. ఈ రెండు సినిమాలు ఇంకా ప్రారంభం కూడా కాకుండానే మరో ఆఫర్ ను దక్కించుకుంది. ఈసారి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో రీమేక్ లో ఛాన్స్ కొట్టేసింది. మలయాళ సూపర్ హిట్ మూవీ కప్పెల రీమేక్ లో ఈమెకు ఛాన్స్ లభించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

విశ్వక్ సేన్ మరియు నవీన్ చంద్రలు నటించబోతున్న ఆ రీమేక్ లో కృతి శెట్టి నటించబోతుంది. ఉప్పెనతో సహా మొత్తం నాలుగు సినిమాలతో ఈ అమ్మడు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నాలుగులో రెండు మూడు సక్సెస్ అయినా కూడా ఈ అమ్మడి స్టార్ డం అమాంతం పెరిగి పోనుంది.