చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చిన సూపర్ స్టార్ స్పోర్ట్స్ బైక్స్

0

తమిళ సూపర్ స్టార్ అజిత్ కు బైక్ రేసింగ్ లు అంటే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో తన వాలిమై షూటింగ్ లో ఉన్నాడు. లాక్ డౌన్ కారణంగా తన బైక్ పై రోడ్డు మార్గంలో అజిత్ చెన్నై చేరుకున్నాడు. వాలిమై సినిమా షూటింగ్ కోసం భారీ చేజింగ్ సీన్ ను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎక్కడ ఆపారో మళ్లీ అక్కడ నుండి మొదలు పెట్టే ఉద్దేశ్యంతో అజిత్ హైదరాబాద్ చేరుకున్నాడు. అజిత్ తో పాటు ఆయన స్పోర్ట్స్ బైక్ లు కూడా హైదరాబాద్ కు వచ్చాయి.

వాలిమై షూటింగ్ లో బైక్ చేజింగ్ సీన్స్లో తానే స్వయంగా పాల్గొనాలనే ఉద్దేశ్యంతో అజిత్ ఉన్నాడు. అందుకే తనకు ఎంతో అనువుగా ఉండే తన బైక్ లను అక్కడ నుండి ఇక్కడకు ప్రత్యేకంగా తెప్పించారని సమాచారం అందుతోంది. బైక్ రేసింగ్ సీన్ అంటే ప్రాణం పెట్టే అజిత్ డూప్ లేకుండా అత్యంత రిస్కీ సీన్స్ లో నటించబోతున్నారు. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న వాలిమై సినిమాను బోణీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమాపై అజిత్ అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు.