ఇలా బాధ్యతలు మరిస్తే ఎలా ఇల్లీ బేబీ?

0

తెలుగు ఆడియన్ ని మెరుపు తీగ నడుముతో మాయలో ముంచేసిన బ్యూటీ ఇలియానా. గోవా టు హైదరాబాద్ ఈ అమ్మడి జర్నీ ఇంట్రెస్టింగ్. దేవదాస్ సినిమాతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. తన సన్నజాజి నడుముతో మ్యాజిక్ చేసిన ఈ గోవా బ్యూటీ స్టార్ హీరోయిన్ గా అనతికాలంలోనే స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది. అప్పట్లోనే కోటికి దగ్గనని ఖరాకండీగా చెప్పేసి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇండస్ట్రీ హిట్ పోకిరితో ఈ అమ్మడికి ఎదురే లేకుండా పోయింది. ఆ తర్వాత జర్నీ గురించి తెలిసిందే. ఇక హిందీ పరిశ్రమలోనూ అంతో ఇంతో కెరీర్ జర్నీ సాగించింది.

`బర్పీ` సినిమాతో బాలీవుడ్ చెక్కేసినా ఇప్పటికీ ఇన్ స్టా వేదికగా టాలీవుడ్ అభిమానులతో టచ్ లో వుంటోంది. హాట్ హాట్ ఫొటో షూట్ లతో నెటిజన్ల మతిపోగొడుతున్న ఇల్లీబేబీ తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. వింక్ గర్ల్ తరహాలో కన్ను గీటుతూ ఒక చిన్న బోట్ లో విహరిస్తూ పారిపోతున్నానని సిగ్నల్ ఇచ్చేసింది. ఇంతకీ ఎక్కడికి పారిపోతోంది? ఎందుకు పారిపోతోంది? అన్నది ప్రశ్నిస్తే..

“తాను బాధ్యతల నుంచి దూరంగా పారిపోతున్నా“ అంటూ ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోకి నెటిజనుల నుంచి స్పందన అదిరిపోయింది. హాట్ ఆటమ్ బాంబ్ మలైకా అరోరా పగలబడి నవ్వుతున్న ఎమోజీలని కామెంట్ ప్లేస్ లో షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇలియానా `పాగల్ పంతి` తరువాత నటించిన చిత్రం `ది బిగ్ బుల్`. స్టాక్ మార్కెట్ బ్రోకర్ హర్షద్ మెహతా లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Me running away from my responsibilities 🤓 #byeeee

null