ఇల్లీ ఇలా కూచుంది.. ఎందుకంటే ప్రపంచం బాగవ్వాలని!

0

కరోనావైరస్ సంక్షోభం తరువాత ఇలియానా డి క్రజ్ ఇంత ఇదిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఇల్లీ ఒక ఫిలాసఫర్ గా సైకాలజిస్టుగా మారిపోయి జనాన్ని ప్రభావితం చేస్తోంది. ఒక రకంగా అద్భుతమైన కొటేషన్స్ చెబుతూ లోకాన్ని నిర్ధేశిస్తోంది.

తాజాగా తన ఆలోచనలను ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వ్యక్తం చేసింది. ఇన్ స్టాలో తన లేటెస్ట్ ఫోటోని షేర్ చేసి..ఎంతో చమత్కారమైన శీర్షికను ఇచ్చింది. ఈ ఫోటోలో ఇలియానా ఎరుపు రంగు గౌనులో బుట్టబొమ్మనే తలపించింది. “ప్రపంచం సాధారణ స్థితికి రావడానికి ఇక్కడ ఇలా కూర్చున్నా“ అన్న వ్యాఖ్యను జోడించింది. ఇక అభిమానులు ఆమె పోస్ట్ ను చాలా ప్రేమతో స్వీకరించి హృదయం ఎమోజీలను షేర్ చేసుకున్నారు.

ఇలియానా డి క్రజ్ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూనో.. బికినీ లో వేడెక్కించే ఫోటోనో షేర్ చేసేది కానీ అందుకు భిన్నంగా ఈ ఫోటోని షేర్ చేసింది. అయితే ఇలా బొమ్మలాగా కూచుని అభిమానుల్ని కన్ఫ్యూజ్ చేస్తోందేమిటో! అయినా ప్రపంచాన్ని ఇలియానా ఏమైనా మార్చేస్తుందా? కరోనాని ఆపగలుగుతుందా.. ఏమిటో! ఇలియానా కెరీర్ సంగతి చూస్తే.. తాను నటిస్తున్న `ది బిగ్ బుల్` రిలీజ్ కి రెడీ అవుతోంది.