ఇల్లీ @ 90 డిగ్రీస్ కవ్వింత

0

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తరువాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కానీ అనుకున్న స్థాయలో మాత్రం భారీ ఆఫర్లని దక్కించుకోలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం తను అందంగా లేకపోవడమేనని కొన్నాళ్ల పాటు బాధపడిందట. అయితే గత కొంత కాలంగా తన ఒంపు సొంపులు ఏమంత ఆకర్షణీయంగా వుండవని తెగ బాధపడిపోయిందట.

తన బాడీలో అందంగా కనిపించని పార్ట్ ల గురించి పేరు పేరున వర్ణించి షాకిచ్చింది. తను అందంగా వుండనని ఫీలయ్యేదాన్నని చెప్పిన ఇలియానా ఫైనల్ గా అందం అంటే ఏంటో తెలుసుకున్నానని ఇక నుంచి అందం విషయంలో ఆందోళన చెందకూడదని నిర్ణయించుకున్నానని స్పష్టం చేసింది. అంతులేని ఆత్మ విశ్వాసంతో తనలో దాగి వున్న అందాలతో మురిసిపోవడం మొదలుపెట్టింది.

తాజాగా ఇన్స్టాలో ఇల్లీ బేబీ 90 డిగ్రీస్ లో కవ్విస్తూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. స్పైసీ చీక్స్..జ్యూసీ లిప్స్..టోన్డ్ బాడీతో బాయ్స్ ని టెమ్ట్ చేస్తోంది. నెటిజన్స్ ని తన అందాలతో కిర్రెక్కించేస్తోంది. ఇలియానా నటిస్తున్న తాజా చిత్రం `ది బిగ్బుల్`డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.