జవానీకి మత్తు దించేసే డేట్ వచ్చేసింది!

0

2019 కియరా నామ సంవత్సరంగా డిక్లేర్ అయ్యింది. వరుస హిట్లతో అమ్మడు మోతెక్కించేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ .. అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూజ్ చిత్రాలలో నటించి బంపర్ హిట్లు అందుకుంది. ఆ రెండు విజయాలతో అందరి కళ్ళకు ఆపిల్ లా కనిపించింది. ఆ తర్వాతనే మహమ్మారీ ఈ అమ్మడికి ఊపిరాడనివ్వలేదు. 2020 ఇంకా పెద్ద టార్గెట్లతో దూసుకుపోవాలని ప్లాన్ చేసింది కానీ అది సాధ్యం కావడం లేదు.

ఎట్టకేలకు కియారా నటించిన తాజా చిత్రం `ఇందూ కి జవానీ` ఓటీటీలో రిలీజవుతోంది. ఈ మూవీ అభిమానులకు ప్రత్యేకించి ఆశ్చర్యం కలిగించే రేంజులో ఉంటుందని ప్రచారం సాగిపోతోంది. తాజాగా కియరా ఓ చమత్కారమైన వీడియోను అభిమానులకు షేర్ చేసింది. ఇందులో ఆమె ఇందూ గుప్తాగా కనిపించింది. ఇది ఇందూ కి జవానీలో తన పాత్ర. ఇందూ కోసం ఉత్సాహంగా ఎలా చూస్తున్నారా.. డేటింగ్ తేదీ ఫిక్స్ చేసేద్దామా అంటూ కియరా ట్విస్టిచ్చింది. స్క్రీన్ పైనే 16 సెప్టెంబర్ ఇది తేదీ అంటూ న్యూస్ చదివేసింది. కియారా వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. “మెయిన్ తోహ్ టైమ్ సే ఆ జాంగి డేట్ కే లియే ఆప్ లేట్ మాట్ హోనా! ఇందూను కలవడానికి ఇంకొంచెం వేచి ఉండండి! #IndooKiJawani. ” అని కోట్ చేసింది. గజియాబాద్ కు చెందిన ఇందూ అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నందున కియారా ఇదిగో ఇలా ప్రత్యేకంగా చమత్కారమైన అవతారంలో కనిపించింది. తన ప్రవర్తన డిక్షన్ పై కియరా చాలానే వర్కవుట్ చేసినట్లు తెలుస్తోంది.

అబీర్ సేన్ గుప్తా ఈ చిత్రానికి దర్శకుడు. `ఇందూ కి జవానీ` డేటింగ్ నేపథ్యంలో సినిమా. ప్రేమలో రకరకాల సాహసాల చుట్టూ తిరిగే ఏజ్డ్ లవ్ స్టోరితో కామెడీ ఆకట్టుకుంటుందట. కియారాతో పాటు ఆదిత్య సీల్ ప్రధాన పాత్రలో నటించింది.