అఖిల్ 5 స్టోరీ లైన్ గురించి ఓ వార్త

0

అక్కినేని అఖిల్ 5వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అంటూ కన్ఫర్మ్ అయ్యింది. సైరా సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోలతో సినిమాను చేసేందుకు సూరి ప్రయత్నించి విఫలం అయ్యాడు. చివరకు పవన్ తో ఓకే అయినా కూడా వచ్చే ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సి ఉండటంతో ఈ గ్యాప్ లో అఖిల్ తో ఒక సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

ఇక ఈ సినిమా ను విభిన్నమైన కాన్సెప్ట్ తో సురేందర్ రెడ్డి తెరకెక్కస్తున్నాడట. సినిమాలో అఖిల్ ఒక అండర్ కవర్ ఆఫీసర్ అంటే ఒక గూడాచారిగా కనిపించబోతున్నాడట. విలన్స్ మద్య ఉండి వారిని అంతం చేసే స్టోరీ లైన్ తో ఈ సినిమా రూపొందబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ లతో గతంలో ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. కాని వాటికి దీనికి చాలా తేడాలు ఉండటంతో పాటు ఇదో విభిన్నమైన స్ర్కీన్ ప్లేతో సాగుతుందంటున్నారు. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ను ప్రారంభించేలా సురేందర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నాడు.

వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు ఇది పూర్తి విభిన్నంగా ఉండబోతుంది. స్పై గా అఖిల్ నటించబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సినిమాకు బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. మరి ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.