కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన నందమూరి ఫ్యామిలీ

0

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై నందమూరి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తెలుసుకోవాల్సిన చరిత్ర ను పాఠ్యాంశంగా చేర్చడం నిజంగా మా కుటుంబం మొత్తంకు ఆనందంగా ఉంది. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి తరపున సీఎం కేసీఆర్ గారికి మరియు తెలంగాణ మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటూ నందమూరి రామకృష్ణ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. అందులో ఆయన కుటుంబ సభ్యులందరి తరపున కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

మా తండ్రిగారు నందమూరి తారక రామారావు గారి జీవితం గురించి ముందు తరాల వారికి తెలియజేసే ఉద్దేశ్యంతో పాఠ్యాంశంలో చేర్చడం జరిగింది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున కృతజ్ఞతలు. ఈ విషయమై యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు అంతా కూడా గర్వపడుతున్నారు. ఎన్టీఆర్ గారి జీవితం భావి తరాలకు ఆదర్శనీయంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ గారిలో ఉన్న నీతి… నిజాయితి.. పట్టుదల.. నిబద్దత ఇవన్నీ కూడా యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. వారు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్తారంటూ నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు.