సీనియర్ హీరోయిన్ ఇంటి గోడ దూకిన అగంతకుడు

0

తమిళం మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన సీనియర్ హీరోయిన్ గౌతమి వార్తల్లో నిలిచారు. ఆమె ఇంట్లోకి ఒక అగంతకుడు గోడ దూకి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సోమవారం రాత్రి సమయంలో గౌతమి ఇంటి గోడను దూకిన ఒక వ్యక్తి గోడ పక్కన కూర్చుని ఉన్నాడు. అతడిని గౌతమి ఇంట్లో పని చేసే సతీష్ అనే వ్యక్తి గుర్తించాడు. వెంటనే ఇంట్లో ఇతరులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్ చేసి అక్కడ నుండి తీసుకు వెళ్లారు. ఆ అగంతకుడు ఎవరు అసలు గౌతమి ఇల్లు గోడ ఎందుకు దూకునట్లు అంటూ అంతా కూడా ప్రస్తుతం చర్చించుకుంటున్నారు.

పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించిన సమయంలో తాగి ఉన్నాడు. దాంతో తాగిన మైకంలో అతడు ఆ ఇంటి గోడ దూకి ఉంటాడు అంటున్నారు. అతడి పాండియన్ అని అతడిది కొట్టివాక్కం కుప్పం ప్రాంతం అంటూ పోలీసులు గుర్తించారు. అతడిపై ఎలాంటి నేర ఆరోపణలు గతంలో లేవు. కేసులు కూడా లేక పోవడంతో పోలీసులు అతడు తాగిన మైకంలో గౌతమి ఇల్లు దూకి ఉంటాడు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. న్యూసెన్స్ సెక్షన్ తో పాటు పలు కేసులను నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్ కు పంపించారు. గౌతమి ఇంటి పని వారు అతడిపై ఫిర్యాదు ఇచ్చారు. ఈ విషయంలో గౌతమి కాని ఆమె కూతురు కాని స్పందించలేదు.