Templates by BIGtheme NET
Home >> Cinema News >> సూపర్ స్టార్ డాటర్ ఫిట్నెస్ కోచ్ తో ప్రేమాయణం!

సూపర్ స్టార్ డాటర్ ఫిట్నెస్ కోచ్ తో ప్రేమాయణం!


బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ఖాన్ కూతురు ఇరా ఖాన్.. ఫిట్నెస్ కోచ్తో ప్రేమలో పడ్డట్టు సమాచారం. ఇరాఖాన్ గతంలో మిషాల్ కృపలానిని ప్రేమించింది. కానీ గత ఏడాది డిసెంబర్లో మిషాల్ కృపలానికి బ్రేకప్ చెప్పింది. మిషాల్తో ఆమె రెండేళ్లపాటు రిలేషన్షిప్ కొనసాగించింది. కానీ వివిధ కారణాల వల్ల వాళ్లు విడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె అమిర్ఖాన్ ఫిట్నెస్ కోచ్తో ప్రేమాయణం నడుపుతున్నట్టు టాక్. నుపూర్ శిఖారే .. అమీర్ఖాన్ కు ఫిట్ నెస్ కోచ్ గా పని చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ సమయం లో నుపూర్ తో ఇరాకు ప్రేమ చిగురించిందట.

వీళ్లిద్దరూ కలిసి ఇటీవల మహాబలేశ్వర్ లోని అమీర్ ఖాన్ ఫామ్ హౌస్ లో కొన్నిరోజుల పాటు గడిపారట. ఇరా తన ప్రేమవిషయాన్ని తల్లి రీనా దత్తాకు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఇరా ఓసారి బ్రేకప్ పడటం తో ఈ సారి మీడియాకు ఆమె వార్తలు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నదట. నూపూర్ శిఖారే చాలా నైపుణ్యం ఉన్న ఫిట్నెస్ కోచ్. ఆయన పదేళ్లపాటు సుష్మితా సేన్కు గా ఫిట్నెస్ కోచ్గా వ్యవహరించాడు. ప్రస్తుతం అమీర్ఖాన్కు ఫిట్నెస్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అమీర్ కూతురితో పరిచయం అయ్యింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమకు దారితీసింది.

ఇటీవల ఇరా.. తన ప్రియుడితో కలిసి దివాళి వేడుకలను జరుపుకుంటున్న ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. మహిళలపై జరుగుతున్న లైంగికవేధింపులపై కూడా ఆమె గళమెత్తారు. తాను 14 ఏళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని మీడియాతో చెప్పారు. డిప్రెషన్పై కూడా ఆమె పలుమార్లు తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇరా ప్రస్తుతం ఓ వెబ్సీరిస్కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో యువరాజ్సింగ్ భార్య హాజెల్ కీచ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.