ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలో ల్యాండ్ అయిన అంతర్జాతీయ స్టార్

0

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ మరియు ఆలియా భట్ వంటి వారు కూడా నటిస్తున్నారు. టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ ల నుండే కాకుండా హాలీవుడ్ నుండి కూడా ఈ సినిమా కోసం స్టార్స్ ను జక్కన్న దించుతున్నాడు. ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి స్టార్స్ ఒలివియా మోరిస్.. రే స్టీవెన్సన్.. అలిసన్ డూడీ లు నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరు నటిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.

ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో అలిసన్ డూడీ పాల్గొనేందుకు ఇండియా చేరుకుంది. ఆ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి తెలియజేసింది. షూటింగ్ కోసం ఇండియాలో ల్యాండ్ అయ్యాను అంది. ప్రస్తుతం ఆమె ఇండియాలో నటించబోతున్న సినిమా ఆర్ఆర్ఆర్ తప్ప మరేది లేదు. కనుక జక్కన్న మూవీ కోసమే ఆమె ఇండియాకు వచ్చిందని అంతా భావిస్తున్నారు. నేటి నుండి అలిసన్ డూడీ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. భారీ పారితోషికంతో ఈ అమ్మడిని జక్కన్న ఈ సినిమాలో నటింపజేస్తున్నారు. ఒలివియా మరియు స్టీవెన్సన్ లు కూడా త్వరలో షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు.

 

View this post on Instagram

 

Lady Scott heading to India 🎬 🔥🌊 #rrrmovie #rrr #ssrajamouli #film @ssrajamouli

A post shared by Alison Doody (@alison_doody) on