2022 డార్లింగ్ నామ సంవత్సరం కాబోతోందా?

0

బ్యాక్ టు బ్యాక్ ప్రకటనలతో మిరాకిల్స్ అంటే ఏమిటో డార్లింగ్ చూపించాడు. అతడి రీసెంట్ యాక్టివిటీని పరిశీలిస్తే స్పీడెంతో అర్థమవుతుంది. ఇలా ఒక సినిమాలో నటిస్తూనే అలా వెంట వెంటనే రెండు పాన్ ఇండియా సినిమాల్ని ప్రకటించాడు. వీటిని పాన్ వరల్డ్ రేంజులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ పెద్ద స్కెచ్చే వేశారు. వందల కోట్ల బడ్జెట్లను వెచ్చించి భారీ గ్రాఫిక్స్ తో విజువల్ మాయాజాలాన్ని క్రియేట్ చేయనున్నారు.

నాగ్ అశ్విన్ తో సినిమా… అలానే ఔంరౌత్ తో ఆదిపురుష్ 3డి ఇవి రెండూ ఎప్పుడు మొదలవుతాయి? ఎప్పుడు రిలీజవుతాయి? అంటే.. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. రాధేశ్యామ్ చిత్రీకరణను పూర్తి చేసిన వెంటనే ఈ రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పట్టాలెక్కిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021లో నాగ్ అశ్విన్ సినిమాని ప్రారంభించి కొంత చిత్రీకరణ సాగాక.. ఆదిపురుష్ కి లైన్ క్లియర్ చేసి ప్రారంభించేస్తారట. అంటే ఈ రెండిటికోసం డార్లింగ్ అటూ ఇటూ పరిగెట్టాల్సి ఉంటుంది.

ఇక రిలీజ్ మాత్రం ఇవి రెండూ 2022లోనే రిలీజయ్యే ఆస్కారం ఉంది. ఒకటి ముందు ఒకటి వెనక అన్నట్టుగా రిలీజ్ చేసేస్తారట. అయితే రెండు పాన్ వరల్డ్ (ఇండియా) రేంజు సినిమాల్ని ఒకే ఏడాదిలో రిలీజ్ చేయడం అంటే ఆషామాషీనా? పైగా డార్లింగ్ ఎప్పుడూ అంత స్పీడ్ చూపించిందేమీ లేదు. అందుకే ఇప్పుడు ఒకేసారి రెండు భారీ బడ్జెట్ చిత్రాల కోసం డార్లింగ్ మేకోవర్ చూపించగలడా? అంటే దానికి డౌట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ 3డి కోసం మెలూహా తరహాలో లేదా శ్రీరాముడి తరహాలో కనిపించే పాత్ర. ఆ రూపురేఖలు ఆహార్యం వేరు. ఫిక్షన్ కథాంశానికి తగ్గట్టు శరీరాకృతిని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీలో హీరో పాత్ర చిత్రణ వేరు. ఈ రెండు రూపురేఖల్లో మార్పు చేర్పులు చూపించాలంటే చాలా గ్యాప్ అవసరం అవుతుంది. భారీ కసరత్తులు చేస్తే తప్ప ఏదీ క్లారిటీగా చేయడం కష్టం. కానీ ప్రభాస్ ఈసారి రెండిటికీ ప్యారలల్ షూటింగులు ప్లాన్ చేసి డేర్ చేస్తాడా? అన్నది చూడాలి. 2022లోనే ఇవి రెండూ రిలీజైతే ఆ ఏడాదిని డార్లింగ్ నామ సంవత్సరం అనో లేక ప్రభాసో నామ సంవత్సరం అనో అనాలి.