డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లో ఫస్ట్ అరెస్ట్ అయ్యేది అతనేనా…?

0

సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మర్డర్ మిస్టరీలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న విషయాలలో.. ఇప్పుడు అసలు విషయం పక్కకు పోయి డ్రగ్స్ మాఫియా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రత్యేక ద్రుష్టి పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే పలువురిని విచారించి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసింది. దీనికి ముందు రియాను విచారించిన ఎన్సీబీ అధికారులు ఆమె నుండి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలోని దాదాపు 25 మంది ప్రముఖల పేర్లు రియా వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ ప్రముఖుల పేర్లు బయటకు రాబోతున్నాయని న్యూస్ వస్తుండటంతో ఇండస్ట్రీలో అందరూ భయపడిపోతున్నారట.

అయితే బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా లింకులు బయటపడిన సమయంలో శాండిల్ వుడ్ లో కూడా డ్రగ్స్ బాంబ్ పేలింది. కన్నడ సీమలో సినీ స్టార్స్ పెద్ద ఎత్తున డ్రగ్స్ దందాతో లింకులు కలిగి ఉన్నారని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజన గల్రానీ లను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు హీరోయిన్స్ తెలుగులో కూడా నటించినవారే. రియా చక్రవర్తి ‘తూనీగ తూనీగ’ సినిమాలో నటించగా.. రాగిణి ద్వివేది ‘జెండా పై కపిరాజు’ మూవీలో నటించింది. సంజన ‘బుజ్జిగాడు’ ‘యమహా యమా’ ‘ముగ్గురు’ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీరిని విచారించి సమాచారం రాబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు డ్రగ్స్ బాంబ్ టాలీవుడ్ లో కూడా పేలనుందని ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ చేసుకుంటున్నారు.

కాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ హీరోయిన్స్ లో ఒకరు టాలీవుడ్ లో కూడా సత్సంబంధాలు కలిగి ఉండటంతో ఇక్కడ కూడా ఆమెకు లింకులు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారట. డ్రగ్స్ కేసులో ఎలాంటి చిన్న క్లూ దొరికినా కూపీ లాగుతున్న అధికారులు త్వరలోనే టాలీవుడ్ పై ఫోకస్ పెడతారేమో అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ హీరోయిన్ టాలీవుడ్ లోని ఓ డైరెక్టర్ తో క్లోజ్ గా ఉండటంతో అతన్ని కూడా ఈ కేసులో విచారిస్తారేమో అని అనుకుంటున్నారు. అందులోనూ అతను డ్రగ్ యూజర్ అని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు అతను టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ పెద్ద పెద్ద వారితో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. దీంతో అతనికి డ్రగ్స్ వ్యవహారంతో లింకులు ఉన్నాయేమో అనే కోణంలో విచారించే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో డ్రగ్స్ మాఫియా కేసులో ఎలాంటి విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయో చూడాలి.