జనతా కాంబో రిపీట్ చేయబోతున్న త్రివిక్రమ్?

0

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నాడు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తి అయ్యి ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేది లేదంటే కనీసం పట్టాలెక్కేందుకు రెడీ అవుతూ ఉండేది. కరోనా కారణంగా అంతా అస్థవ్యస్థంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ విషయంలో క్లారిటీ రావడం లేదు. దాంతో త్రివిక్రమ్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుండి ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు.

వీరి కాంబో మూవీ గురించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త వీరి కాంబో మూవీ గురించి నెట్టింట ప్రచారం మొదలయ్యింది. ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను దర్శకుడు త్రివిక్రమ్ సంప్రదించాడట. ఒక రాజకీయ నాయకుడి పాత్ర కోసం మోహన్ లాల్ అయితే బాగుంటుందనే అభిప్రాయంకు త్రివిక్రమ్ వచ్చాడు. విలువలతో కూడిన రాజకీయ చేసే ఒక మంచి పాత్రను మోహన్ లాల్ తో త్రివిక్రమ్ చేయించబోతున్నాడు.

గతంలో జనతా గ్యారేజ్ చిత్రంలో దర్శకుడు కొరటాల శివ వీరిద్దరి కాంబోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఎన్టీఆర్ మోహన్ లాల్ ల కాంబోకు సక్సెస్ కాంబో అంటూ పేరు ఉంది కనుక త్రివిక్రమ్ ఎక్కువ ఆలోచించకుండా మోహన్ లాల్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మల్లో ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఈ విషయాలన్నింటి పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.