Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఇంట్లో హీరోకే మెగాస్టార్ ఛాన్సిస్తారా..!?

ఇంట్లో హీరోకే మెగాస్టార్ ఛాన్సిస్తారా..!?


మెగా కాంపౌండ్ పై ఇప్పటి కే రకరకాల విమర్శలు ఉన్నాయి. ఆ ఒక్క ఫ్యామిలీ నుంచే దాదాపు టీమిండియాలా 11 మంది స్టార్లు పుట్టుకొచ్చారు. నెపోటిజానికి బాటలు వేసారు అంటూ డైరెక్టు గా మీడియా ఎదుటే విమర్శించే లేదా అక్కసు వెల్లగక్కే వాళ్లు ఉన్నారు.

అయితే మెగాస్టార్ మాత్రం ఇవేవీ పట్టించుకోరు. ఆ వృక్షం నీడలో అన్ని మొక్కలు నీడ పొందుతుంటే ఆ మేరకు ఉపాధి పెరిగిందనేది ఆయన అభిమానుల వెర్షన్. ఇండస్ట్రీకి సినిమాలు తీసేవాళ్లే కావాలి.. రావాలి! అని విశ్లేషిస్తుంటారు. అదంతా సరే కానీ.. ప్రస్తుతం చిరు సినిమాలో చరణ్ నటించడాన్ని నెపోటిజం(నటవారసత్వం.. స్వాభిమానం) వ్యతిరేకులు అంగీకరిస్తారా? అంటే.. టాలీవుడ్ వరకూ దీని పై ఏమంత బిగ్ డిబేట్ కనిపించదు.

కొరటాల సినిమా కోసం చిరు స్వయంగా బయటి హీరోనే సంప్రదించారు. తనకు ఎంతో ఇష్టుడైన సూపర్ స్టార్ మహేష్ ని తన సినిమా ఆచార్యలో నటించమని ఆఫర్ ఇచ్చారు. కానీ మహేష్ కి కుదరకపోవడంతో చివరికి రామ్ చరణ్ ని ఫైనల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక చిరు-చరణ్ మల్టీస్టారర్ సంగతి అటుంచితే.. తదుపరి చిరంజీవి నటించే సినిమాల్లో మెగా యువహీరోలంతా నటిస్తారా? అన్న చర్చా మొదలైంది. ప్రిన్స్ వరుణ్ తేజ్ కానీ.. సుప్రీం హీరో సాయి తేజ్ కానీ తదుపరి నటించే వీలుందని గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కే.ఎస్.రవీంద్ర అలియాస్ బాబి ఈ మూవీని తెరకెక్కిస్తారు. అయితే ఆ ఇద్దరిలో జాక్ పాట్ ఎవరిని వరిస్తుంది? అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది.

మెగాస్టార్ బయటి హీరోలతో కలిసి పని చేస్తేనే బావుంటుందా.. లేక సొంత హీరోల తో పని చేస్తే బావుంటుందా? అన్న సరికొత్త డిబేట్ కి ఈ కలయిక దారి తీస్తుందనడంలో సందేహమేం లేదు. ఎందుకంటే ఎక్కువ సార్లు `మెగా-మెగా` అనేది ప్రేక్షకులకు కూడా బాగా కనిపించదు. మెగాయేతర హీరో చిరంజీవి సినిమాలో భాగం కావాలని కోరుకుంటారు. అందుకే చిరు కూడా వేరే హీరోలనే ప్రిఫర్ చేస్తుంటారు. ఇక చిరు సినిమా లో ఆఫర్ వస్తే ఏ హీరో అయినా కాదని అనరు కదా?