#ఆర్ఆర్ఆర్ : భట్ ఔట్ చోప్రా ఇన్ !?

0

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా స్టార్ కిడ్స్ కు గడ్డు కాలం నడుస్తోంది. ఆలియా భట్ నటించిన సడక్ 2 చిత్రం ఎదుర్కొంటున్న వ్యతిరేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రైలర్ కు వచ్చిన డిస్ లైక్స్ ఆమెపై జనాల్లో ఉన్న వ్యతిరేకతను చూపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అందుకే ఆమెను సినిమా నుండి తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆలియా భట్ తో ఇప్పటికే షూటింగ్ చేశారు. ఇంకా ఆమెపై షూటింగ్ చేయాల్సింది చాలానే ఉందట. ఇలాంటి సమయంలో ఆమెను కంటిన్యూ చేయడం ఆత్మహత్య సదృశ్యం అవుతుందని అంతా భావిస్తున్నారట. ఈ విషయంలో రాజమౌళి కూడా ఒక నిర్ణయానికి వచ్చాడని నిర్మాత మరియు ఇతర యూనిట్ సభ్యులతో రాజమౌళి మాట్లాడాడు అని ఆమె స్థానంలో మరెవ్వరిని అయినా తీసుకుంటేనే బాగుంటుందనే అభిప్రాయంను అంతా వ్యక్తం చేశారట. దాంతో జక్కన్న ఆమె స్థానంలో ప్రియాంక చోప్రా అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాడట.

ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చూస్తూ చూస్తూ ఆలియాను తీసుకుని వ్యతిరేకత ఎదుర్కోవడం ఎందుకు అని ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. ఆ కారణంగానే ఆలియాను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారని.. బడ్జెట్ పెరిగినా కూడా తప్పదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయంపై ఎలా స్పందించబోతున్నారో చూడాలి.