కాజల్ నిశ్చితార్థం గుట్టు చప్పుడు కాకుండా.. గెస్ట్ ఎవరో తెలుసా?

0

అందాల చందమామ కాజల్ పెళ్లి పై గత కొంతకాలంగా రకరకాల పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. 30 ప్లస్ లో అడుగుపెట్టిన కాజల్ ఇక వెడ్ లాక్ కి రెడీ అయ్యిందని గౌతమ్ అనే బిజినెస్ మేన్ తో నిశ్చితార్థం గుట్టు చప్పుడు కాకుండా సైలెంటుగా అయిపోయిందని ప్రచారం హీటెక్కిస్తోంది. లాక్ డౌన్ లో కావాల్సినంత తీరిక సమయం చిక్కడంతో సెలబ్రిటీలంతా ఓ ఇంటివాళ్లయిపోతున్నారు. ఇప్పుడు కాజల్ వంతు వచ్చిందని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని రకరకాలుగా ప్రచారం అయిపోతోంది.

ఇక నిశ్చితార్థం తంతు కానిచ్చేసినా కాజల్ కుటుంబం కానీ.. పెళ్లికొడుకు తరపు వాళ్లు కానీ దాని గురించి అధికారికంగా ప్రకటించకుండా గోప్యంగా ఉంచారట. అంతేకాదు.. కాజల్ నిశ్చితార్థానికి కోస్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఎటెండయ్యాడని జోరుగా ప్రచారం సాగిపోతోంది.

ఇదొక్కటే కాదు.. నిశ్చితార్థంతో పాటు పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే కాజల్ తన దర్శకనిర్మాతలు హీరోలకు ఫోన్ చేసి కొన్ని కండీషన్స్ పెడుతోందట. తన పార్ట్ షూటింగును తొందరగా పూర్తి చేసేయాలని సూచిస్తోందట. కొరటాలకు ఇప్పటికే ఫోన్ చేసి చెప్పేసిందట. ఆచార్య షెడ్యూల్స్ ఏవి ఉన్నా త్వరగా పూర్తి చేయాలని చెప్పిందట. అలాగే భారతీయుడు 2 దర్శకుడు శంకర్ కి హింట్ ఇచ్చేసిందట. ఇక కాజల్ ఫోన్ కాల్ అందుకున్న కొరటాల అందుకు సహకరిస్తున్నాడని ..షెడ్యూల్స్ ని మార్చి కాజల్ కి అనుకూలంగా ఉండేలా చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే కాజల్ వేరొక కొత్త సినిమాకి కమిటవ్వకపోవడంతో ఇవన్నీ నిజాలేనని జోరుగా ప్రచారం సాగిపోతోంది.