Templates by BIGtheme NET
Home >> Cinema News >> జక్కన్న వ్యాఖ్యలతో వారికి కాస్త ఊరట!

జక్కన్న వ్యాఖ్యలతో వారికి కాస్త ఊరట!


కరోనా కారణంగా మూత బడ్డ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయ్యేది క్లారిటీ లేదు. సెప్టెంటర్ మొదటి వారం నుండి అంటూ ప్రచారం అయితే జరుగుతోంది. కాని జనాలు థియేటర్లకు వస్తారా అనే ఆందోళన థియేటర్ల యాజమానుల్లో వ్యక్తం అవుతోంది. ఓటీటీ ఆధరణ విపరీతంగా పెరగడంతో పాటు కొత్త సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్న కారణంగా జనాలు థియేటర్ల వరకు వస్తారా అంటూ కొందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు థియేటర్ల యాజమాన్యాలకు కాస్త ఊరటను ఇస్తున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వూలో రాజమౌళి ఓటీటీ థియేటర్ల గురించి మాట్లాడారు. ఓటీటీలకు ఆధరణ పెరిగిన నేపథ్యంలో థియేటర్లకు జనాలు వస్తారని మీరు అనుకుంటున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించిన సమయంలో రాజమౌళి స్పందిస్తూ… కరోనా భయం అనేది జనాల నుండి పూర్తిగా వెళ్లి పోవాలి. అప్పుడే థియేటర్లకు జనాలు వస్తారు. జనాల్లో కరోనా భయం పోతే ఖచ్చితంగా థియేటర్లకు క్యూ కడతారు. ఒక పెద్ద సినిమా వస్తే మునుపటి కంటే ఎక్కువగా జనాలు వచ్చే అవకాశం ఉందనే నమ్మకంను రాజమౌళి వ్యక్తం చేశారు.

ఆయన మాటలను బట్టి కరోనా భయం పోయాక ఒక భారీ సినిమా రావాలి. అది రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టాలి. అప్పుడు మళ్లీ మునుపటి పరిస్థతి వస్తుందని విశ్లేషకులు సైతం అంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభం నుండి అంటే సంక్రాంతి సీజన్ వరకు కరోనా భయం పోవడం సంక్రాంతికి రాబోతున్న సినిమాలు దుమ్ము రేపడం ఖాయం అంటూ మరికొందరు నమ్మకంగా చెబుతున్నారు.