#రాపో.. `రెడ్` రిలీజ్ `డైలమా` క్లియర్ కాలేదా?

0

మహమ్మారీ ఎందరినో ఎన్నో రకాలుగా డిస్ట్రబ్ చేసింది. రిలీజుల్లేవ్.. సినిమాల షూటింగుల్లేవ్.. ఎనిమిది నెలలుగా ఇదే ధైన్యం. వైరస్ దెబ్బకు ఎక్కడివాళ్లు అక్కడే గప్ చుప్ అన్నట్టుగానే ఉంది పరిస్థితి.

ఇదే సీజన్ లో ఓటీటీ వెల్లువతో చాలా మంది ఇక థియేటర్ల లో రిలీజ్ కోసం వేచి చూసే కంటే నేరుగా ఓటీటీ రిలీజ్ తో అడ్జెస్ట్ అవ్వడమే బెస్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే అరడజను పైగా క్రేజీ చిత్రాలు ఓటీటీలో వచ్చేశాయి. కానీ రామ్ రెడ్ మాత్రం ఓటీటీకి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. కిషోర్ తరుమల- స్రవంతి రవికిషోర్ ఇద్దరూ ఓటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపినా హీరో రామ్ మాత్రం అందుకు ఓకే చెప్పలేదట.

ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రెడ్ ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి సర్వశక్తులు ఒడ్డి నటించిన రామ్ ఈ సినిమాని బంపర్ హిట్ చేయాలన్న పంతంతో ఉన్నాడు. అందుకే ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన దానిని మహమ్మారీ వల్ల కిల్ అవ్వకుండా ఆపే ప్రయత్నం చేశాడు. ఇటీవల సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రచారం సాగింది. కానీ అప్పటికీ కష్టమే అన్న చర్చా సాగుతోంది. తాజా సన్నివేశం చూస్తుంటే రామ్ -స్రవంతి బృందంలో ఇంకా డైలమా అలానే ఉందని అర్థమవుతోంది. రిలీజ్ పై స్పష్ఠత వచ్చినట్టు లేదు. అందుకే ఓటీటీ ఆఫర్లను పలుమార్లు తిరస్కరించారు. ఒకవేళ సంక్రాంతికి రిలీజ్ కాకపోతే నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తారా? అన్నదానిపైనా చిత్రబృందం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.