విడాకుల దిశగా మరో హీరోయిన్ ?

0

క‌న్న‌డ హీరోయిన్ సంజ‌నా మొదటినుండీ వివాదాల కేంద్రభిందువుగానే ఉంది. దీనికితోడు డ్ర‌గ్స్ కేసులో అడ్డంగా ఇరుక్కోవ‌డం, పైగా ఆ కేసులో జైలుకెళ్లి రావ‌డం, అంతలోనే ఆమె పై కొన్ని చీటింగ్ ఆరోపణలు రావడం.. ఇలా అనేక చేదు అనుభవాల మధ్య సడెన్ గా పెళ్లి చేసుకుని సోషల్ మీడియాకే షాక్ ఇవ్వడం.. మొత్తంగా సంజనా జీవితం గత రెండేళ్లలో చాల మలుపులు తిరిగింది.

సంజనా, అజీజ్‌ పాషాతో పెళ్లి తర్వాత మీడియాకి దూరంగా ఉంది. కానీ పుకార్లు మాత్రం ఆమెను వదలడం లేదు. పెళ్లి అయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే సంజనాకి ఆమె భర్తతో అభిప్రాయబేధాలు వచ్చాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, సంజనా మాత్రం ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పింది.

తన భర్త అజీజ్‌ పాషా చాలామంచి వాడు అని, త‌ను వృత్తిరీత్యా డాక్టర్ అని, బెంగ‌ళూరులోని తానూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కీలక బాధ్యతలు నిర్వ‌ర్తిస్తున్నాడని చెబుతూ తెగ మురిసిపోయింది. పైగా తన భర్త అజీజ్‌, తనకు బాల్య‌మిత్రుడు అని, త‌మ మ‌ధ్య చిన్న‌ప్పుడే ఏర్ప‌డిన స్నేహం పెద్ద‌యిన త‌ర్వాత ప్రేమ‌కు మారింది అని, ఈ ప్రపంచంలో తను ఒక్కడే నన్ను బాగా అర్ధం చేసుకుంటాడని ఇలా ఓ రేంజ్ లో మొగుడి గురించి గొప్పలు చెప్పింది.

కానీ, ఆ గొప్పలు తాలూకు వార్తలు ప్రజలు ఇంకా మరిచిపోకముందే.. ఇలా సంజనా భర్తతో విడిపోబోతుంది అని వార్తలు రావడం విచారకరమే. కాకపోతే.. ఆ విచారం సంజనాలో ఉండదు అనేది ఆమె గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. ఏది ఏమైనా పెళ్ళికి ముందే భర్తతో కొంత కాలం డేటింగ్‌ కూడా చేసింది సంజనా.