తన సోదరితో సుశాంత్ కి సత్సంబంధాల్లేవా?

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రోజుకో మలుపు ఉత్కంఠ పెంచుతోంది. ఈడీ దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి ఉక్కిరి బిక్కిరి అయిన సంగతి తెలిసిందే. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్లు అనూహ్యంగా మాయమవ్వడం అటుపై ముంబైలో రియా తన పేరున తన కుటుంబీకుల పేరున ఫ్లాట్లు కొనుక్కోవడం వగైరా వ్యవహారాలపై దర్యాప్తు సాగుతోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని తిప్పి కొట్టేందుకు రియా చేయని ప్రయత్నం లేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి సహా బావగారిపైనా.. సుశాంత్ రూమ్మేట్ పైనా రియా తీవ్రంగానే ఆరోపిస్తోంది. తనపై కేసు పెట్టిన సుశాంత్ తండ్రి పైనా రియా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది.

తాజాగా సుశాంత్ తో పాత వాట్సాప్ చాట్ లను బయటపెట్టి తన తప్పేమీ లేదని రియా సమర్థించుకోవడం చర్చకు వచ్చింది. తన ఫోన్ లో స్క్రీన్ షాట్లను చూపించి మరీ ఆధారాల్ని చూపిస్తోంది రియా. ఇందులో సుశాంత్ సింగ్ కి తన సోదరితో సరిగా సత్సంబంధాలు లేవని.. రియాతో ఆమె కుటుంబంతో కలిసి ఉండడం వల్లనే సుశాంత్ ఆనందంగా ఉన్నట్టుగా అర్థం వచ్చే మెసేజ్ లు ఉన్నాయి. తన సోదరిని సుశాంత్ `మ్యానిప్యులేట్` అనడం కనిపిస్తోంది. అలాగే తన ఫ్రెండు మైండ్ ను సోదరి తారుమారు చేస్తుందన్న అర్థం వచ్చే సందేశం కనిపిస్తోంది. అంతేకాదు.. తన సోదరిని భగవంతుడు క్షమించడు అనే అర్థం వచ్చే మెసేజ్ ని రియా చూపించింది.

మొత్తానికి సోదరితో విభేధాలు బయట పెట్టి సుశాంత్ ఆత్మకు శాంతి అన్నదే లేకుండా చేస్తోంది రియా. ఒకవేళ రియా చూపిస్తున్న ఆధారాలన్నీ వాస్తవమైనవే అయితే .. తాను నిరపరాధి అయితే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో సీబీఐ ఏ మేరకు పురోగతి సాధిస్తుంది అన్నది ఇప్పటికి సస్పెన్స్. ప్రస్తుతం రియా ఆమె సోదరుడు సహా కుటుంబీకులపై సుశాంత్ తండ్రి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మనీ ల్యాండరింగ్ కేసు రియాకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.