Templates by BIGtheme NET
Home >> Cinema News >> కుర్ర భామతో యువ హీరో లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడా..?

కుర్ర భామతో యువ హీరో లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడా..?


ఏ ఇద్దరు హీరోహీరోయిన్లు కలిసి నటించినా.. కలిసి బయట తిరిగినా వారి మధ్య ఎఫైర్ ఉందని.. ఏదో వ్యవహారం నడుస్తోందని.. ఇలా వార్తలు రావడం సినిమా ఇండస్ట్రీలో కామన్ గా జరిగే విషయమే. కొన్ని సార్లు ఓ అడుగు ముందుకేసి ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని.. సీక్రెట్ మ్యారేజ్ కూడా చేసుకున్నారని రూమర్స్ వస్తుంటాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ ప్రేమాయణం సాగించిన కొన్ని జంటలు కూడా ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ యువ హీరో ఓ కుర్ర భామతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో కొన్ని సంవత్సరాలుగా హవా కొనసాగిస్తున్న ఓ ప్రముఖ వ్యక్తి.. తన ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఇద్దరూ కూడా ఎవరికి నచ్చిన ఫీల్డ్ ను వారు సెలెక్ట్ చేసుకున్నారు. ఒకరు తెర మీద కనిపోస్తే.. మరొకరు తెర వెనుక ఉంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఫ్యామిలీలో ఉన్న ఓ అగ్ర దర్శకుడి నీడ సపోర్ట్ కూడా ఉండటంతో అన్నదమ్ములకు అవకాశాలకు డోకా లేకుండా పోయింది. అయితే హీరోగా రాణించాలని ట్రై చేస్తున్న తనయుడు ఇప్పుడు ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడట.

సక్సెస్ ఫుల్ సినిమాతో హీరోగా లాంచ్ అయిన యువ హీరో.. ఆ తర్వాత ఓ ప్లాప్ మూటగట్టుకున్నాడు. అయినప్పటికీ కృంగి పోకుండా నూతనోత్సాహంతో పని చేయాలని తనకు తాను మోటివేట్ చేసుకొని ఓ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ లోని ఓ పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించే సినిమాలో హీరో నటించే అవకాశం అందుకున్నాడు. ఇందులో హీరోయిన్ ని ఎంపిక చేసే క్రమంలో ఈ ఏడాది హిట్ ఇచ్చిన ఓ బ్యూటీతో ఆడిషన్ చేశారట. దర్శక నిర్మాతలు ఎందుకో అమ్మడిని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారట. అయితే ఈ టైమ్ లో హీరోకి ఆమెతో పరిచయం ఏర్పడటం.. ఇప్పుడా ఆ పరిచయం ప్రేమగా మారిండటం జరిగిపోయాయని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమేనా లేదా రూమర్స్ అనేది ఇంకొన్నాళ్లు అయితే కానీ క్లారిటీ వస్తుంది.