ఐషాశర్మ ఇన్ స్టా ఫోటో దుమారం

0

చిరుత` ఫేం నేహాశర్మ సోదరి ఐషాశర్మ తో కలిసి సోషల్ మీడియాల్లో నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. శర్మా సిస్టర్స్ ఇస్పీడ్ పై కుర్రకారులో ఒకటే వాడి వేడిగా చర్చ సాగుతుంది. ఫోటో ట్రీట్ వీడియో ట్రీట్ అన్ లిమిటెడ్ ఇక్కడ. తాజాగా ఐషా శర్మ ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో దుమారం రేపుతోంది.

శర్మా గాళ్ చిట్టి పొట్టి నిక్కరులో పెను దుమారమే రేపింది. ఇక బ్లూ టాప్ .. డెనిమ్ నిక్కర్ లో నేహా శర్మ హీట్ పెంచేస్తోందనే చెప్పాలి. ఇక రింగుల కురులు గాలికి అటూ ఇటూ కదులుతుంటే సింపుల్ గా స్మైలిచ్చేస్తోంది ఈ బ్యూటీ. ఇక ఈ భామ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు యూత్ లో ఒకటే కాకలు పుట్టించేస్తున్నాయ్.

ఇంతకుముందు కూడా అదిరిపోయే గ్లామరస్ ఫోటోని షేర్ చేసిన ఐషా శర్మ డబుల్ మీనింగ్ డైలాగ్ తో కంగారు పెట్టింది. `గ్రామ్` అంటూ ప్రస్థావించి లేనిపోని డౌట్లు పెట్టేసింది. ఆ ఫోటోకి ఇచ్చిన క్యాప్షన్ లో ఏం ఉంది? అంటే.. “యు నో ది వాట్ ఐ మిస్డ్ ఎబౌట్ ది `గ్రామ్` ది మోస్ట్ మై వోన్ పోస్ట్స్ అండ్ స్టోరీస్.. హహహహ“ అంటూ జోకేసింది. బాలీవుడ్ డ్రగ్ మాఫియా పై విచారణ నేపథ్యంలో `గ్రామ్` అన్న సౌండింగ్ కంగారు పెట్టింది. ప్రతిసారీ ఇలా ఏదో ఒకటి చేసి కుర్రకారు గుండెల్లోకి బాంబులు చుట్టి విసిరేస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఓ స్టార్ హీరో మూవీలో నటిస్తున్నా కోవిడ్ వల్ల షూటింగ్ వాయిదా పడిపోయింది. 2021లో అయినా స్టార్ లీగ్ లో చేరాలన్న పంతంతో ఉందిట. అందుకే ఇలా డిజిటల్ లో చెలరేగిపోతోంది.