మరో హిట్ కోసం ఇస్మార్ట్ కాంబో రిపీట్

0

సుదీర్ఘ కాలం తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ కు వరుస ఫ్లాప్స్ తర్వాత రామ్ కు ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సక్సెస్ దక్కిన విషయం తెల్సిందే. ఇస్మార్ట్ సక్సెస్ తో వీరిద్దరు కూడా చాలా జోరుమీదున్నారు. ప్రస్తుతం వీరు చేస్తున్న సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతున్నా త్వరలోనే వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇదే సమయంలో వీరిద్దరి కాంబో మూవీ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమాను తెరకెక్కిస్తున్న పూరి జగన్నాధ్ వచ్చే ఏడాది వరకు ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పున: ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే రామ్ కోసం పూరి స్క్రిప్ట్ రెడీ చేశాడంటూ సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ చివరి వరకు రామ్ తో సినిమాను మొదలు పెట్టి వచ్చే ఏడాదిలోనే విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడట.

పూరి మళ్లీ బిజీ కాబోతున్నాడు. ఈమద్య కాలంలో ఈయన పలువురు హీరోల సినిమాలకు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటన్నింటికంటే ముందుగా రామ్ తోనే మరో సినిమాను పూరి చేస్తాడంటూ సమాచారం అందుతోంది. రామ్ తో మరో ఫుల్ లెంగ్త్ ఎనర్జిటిక్ మాస్ మూవీని పూరి చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో పూరి రామ్ ల కాంబో లో రాబోతున్నది డబుల్ ఇస్మార్ట్ శంకర్ అంటున్నారు. ఇప్పటికే సీక్వెల్ ప్రకటించినా కూడా అది ఇదేనా కాదా అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.