వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న పాతికేళ్ల సుందరి!!

0

ఐశ్వర్య మీనన్.. అంటే సౌత్ ఇండియా ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉన్నా తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్తే. ఎందుకంటే ఈ భామ తమిళ కన్నడ మలయాళం బాషలలో సినిమాలు చేసింది కానీ ఇంతవరకు తెలుగులో సినిమా చేయలేదు. కానీ త్వరలోనే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తుంది. తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ పాతికేళ్ల చిన్నది.. తన సొగసులను కెమెరా ముందు పరచడానికి ఏ మాత్రం సందేహించదు. పాఠశాల విద్యను భారతి విద్యాభవన్ మెట్రిక్యూలేషన్ స్కూల్లో కంప్లీట్ చేసి చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుండి ఇంస్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందింది. అమ్మడు 2012లో ‘కాధలిల్ సోదప్పువదు ఎప్పడి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా తెలుగులో సిద్దార్థ్ హీరోగా లవ్ ఫెయిల్యూర్ పేరుతో రూపొందింది. ఇక 2013లో దసవాల సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది.

ఆ సినిమా ఐశ్వర్యకు మంచి పేరే తీసుకొచ్చిందట. ఇక పలు తమిళ కన్నడ సినిమాల తర్వాత 2016లో ‘మాన్సూన్ మాంగోస్’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి కూడా ప్రవేశించింది. ఇక ప్రస్తుతం అయితే ఐశ్వర్య చేతిలో తమిళ సినిమాలే ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ భామ ఎంత గ్లామర్ ఒలికిస్తుందో.. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఖాళీగా ఉంటే చాలు ఫోటోషూట్స్ చేస్తూ కొత్త కొత్త గ్లామర్ ఫోటోలు నెట్టింట పోస్ట్ చేస్తుంది. తాజాగా అమ్మడు కొన్ని అందాల ఆరబోసిన పిక్స్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఐశ్వర్య సోయగాలు చూస్తూ కుర్రాళ్ళు మతిపోయేలా ఉందంటున్నారు. కానీ ఐశ్వర్య ఎలాంటి డ్రెస్ ధరించినా సోషల్ మీడియాలో సెగలు పుట్టడం మాత్రం పక్కా అంటున్నారు. అలా ఉంటున్నాయి మరి ఈ ముద్దుగుమ్మ వయ్యారాలు.. ఫ్యాన్స్ అయితే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య అందాలు ఐశ్వర్యం మొత్తం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.