Templates by BIGtheme NET
Home >> Cinema News >> నాన్నే నాకు ప్రేరణ.. జామీ లీవర్

నాన్నే నాకు ప్రేరణ.. జామీ లీవర్


ఆంధ్రప్రదేశ్కు చెందిన జానీ లీవర్ ముంబైలో స్థిరపడి బాలీవుడ్లో ప్రముఖ కమెడీయన్గా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కూతురు జామీ లీవర్ కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. జామీ తొలిసారిగా 2015లో కామెడీ షో నటుడు కపిల్ శర్మ తీసిన సినిమా ‘కిస్ కిస్కో ప్యార్ కరూ’ లో నటించారు. ఆ తర్వాత 2019లో విడుదలైన హౌస్ఫుల్ 4లోనూ కనిపించారు. అయితే ఆ చిత్రాలు ఆమెకు ఆశించిన స్థాయిలో పేరు తేలేదు. కానీ తన తండ్రి జానీ లీవర్తో కలిసి ఆమె ప్రపంచంలోని పలు దేశాల్లో స్టేజ్ షోలు ఇచ్చారు. ఈ షోలతో ఆమె ఎంతో గుర్తింపుతెచ్చుకున్నారు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూ లో జామీ తన తండ్రి గురించి ఏమన్నారంటే.. ‘డాడీ ఇంట్లో చాలా కూల్గా ఉంటారు. కానీ స్టేజ్షోలో నేను ఏదన్నా తప్పు చేస్తే మాత్రం అస్సలు సహించరు. ఆయన వల్లే నేను నటన నేర్చుకున్నాను. ఆయన ఎంతో కష్టపడి పైకొచ్చారు. నాకు కూడా నటనను గురించి ఎన్నో మెలకువలు నేర్పించారు. ఆయన ముందు నటించాల్సి వస్తే మాత్రం నేను చాలా సార్లు రిహార్సల్స్ చేసుకొని వెళతాను.

నాకు మొదటి నుంచి మీడియా రంగంపై ఆసక్తి ఉండేది. అందుకే ముంబైలో
మాస్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. తర్వాత లండన్లోని వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్ పూర్తిచేశా. కొంతకాలం అక్కడ ఉద్యోగం కూడా చేశాను. కానీ సినిమా రంగం మీద ప్రేమతో ముంబై వచ్చేశా. నన్ను నాన్న ఎప్పుడూ సిఫారసు చేయలేదు. నేనే సొంతంగానే అవకాశాలు తెచ్చుకున్నా. ఇటీవల నేను చేసిన వీడియోలు కొన్ని యూట్యూబ్లో వైరల్గా మారాయి. నేను ఎవరినన్నా ఇమిటేట్ చేయాలంటే ఒకటి రెండు సార్లు వాళ్ల వీడియోలు చూసి ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తా’ అంటూ చెప్పుకొచ్చారు జామీ.