బిగ్ రిలీజ్ కోసం మాళవికా మోహనన్ నిరీక్షణ

0

థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం విజయ్ హీరోయిన్ కలలు కంటోంది. తమిళ సూపర్స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం `మాస్టర్`. ఇందులో విజయ్ కి జోడీగా మాళవికా మోహనన్ నటించిన విషయం తెలిసిందే. `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. గ్జావియర్ బ్రిట్టో నిర్మించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారని గత కొన్ని నెలలుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

అయితే విజయ్తో పాటు చిత్ర బృందం మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. లేట్ అయినా సరే లేటెస్ట్గా వస్తామంటూ థియేటర్లో మాత్రమే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. ఈ మూవీ రిలీజ్ కోసం విజయ్ హీరోయిన్ మాళవికా మోహనన్ నిరీక్షిస్తోందట. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. థియేటర్లో తొలి రోజు తొలి షో ప్రేక్షకుల మధ్య చూడాలని ఆశగా ఎదురుచూస్తోందట.

సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన `పేట్టా` చిత్రంలో శశికాంత్ కు జోడీగా మాళవికా మోహనన్ నటించింది. ఈ మూవీ రిలీజ్ రోజున తొలి షో థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చుని చూసి అనుభూతిని పొందిందట. అదే స్థాయి అనుభూతిని `మాస్టర్` మూవీ తొలి రోజు తొలి ఆటకు పొందాలని ఉవ్విళ్లూరుతోందని చెబుతున్నారు. థియేటర్స్ ఇటీవల రీ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. `మాస్టర్` చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారట. దీంతో మాళవికా మోహనన్ ఈ సమయం కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నట్టు తమిళ వర్గాలు అంటున్నాయి.