అతిలోక సుందరిని తలపిస్తోంది

0

అందమైన నవ్వు.. నటన .. ఆహార్యంలో లెజెండరీ అని నిరూపించారు మేటి నాయిక శ్రీదేవి. 16ఏళ్ల వయసు మొదలు ఎన్నో గొప్ప క్లాసిక్ సినిమాల్లో గొప్ప నటనతో మెప్పించిన శ్రీదేవి కెరీర్ పరంగా ఇంతింతై అన్న చందంగా ఎదిగి ఇటు సౌత్ అటు నార్త్ రెండు చోట్లా వీరాభిమానుల్ని సంపాదించుకున్నారు. హిందీ అగ్ర నిర్మాత బోనీకపూర్ అప్పటికే పెళ్లయి పిల్లలున్నా ఆమె మాయలో పడిపోయారంటే ఆ అందం ప్రతిభ అలాంటిది. మెగాస్టార్ చిరంజీవి సరసన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో నటించిన శ్రీదేవి ని ఇంద్రుని కుమార్తెగా అతిలోక సుందరిగా జనం వోన్ చేసుకున్నారు.

మరి అంతటి గొప్ప అందగత్తెకు ప్రతిభావనికి వారసురాలిగా తెరంగేట్రం చేసిన జాన్వీ సన్నివేశమేమిటి? అంటే .. శ్రీదేవికి రీప్లేస్ మెంట్ అన్నదే లేదు అని అభిమానులు చెబుతుంటారు. జాన్వీ ఇంకా డెబ్యూ నటి మాత్రమే. ప్రతిభ పరంగా ఎంతో నిరూపించుకోవాల్సి ఉంది. మామ్ శ్రీదేవిలా విలక్షణ నటి అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది.

జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ నాయికగానే ఉన్నా.. ఇంకా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ నటి కాలేదు. కెరీర్ పరంగా ఎదిగేందుకు ఎంతో స్కోప్ ఉంది. ఇక సోషల్ మీడియాల్లో తన అభిమానులకు నిరంతరం అదిరిపోయే ఫోటోషూట్లను షేర్ చేస్తూ జాన్వీ అందరి కళ్లను ఆకర్షిస్తోంది. లేటెస్టుగా నెవ్వర్ బిఫోర్ లుక్ తో మరోసారి ఆకర్షించింది. ఇదో సింపుల్ డిజైనర్ లుక్ .. చక్కని ఎంబ్రాయిడరీ క్రిస్టల్ వర్క్ తో లైటర్ వెయిన్ లుక్ తో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జాన్వీ స్మైల్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. తఖ్త్ ..రూహీ అఫ్జానా.. దోస్తానా 2 వంటి చిత్రాల్లో నటిస్తూ జాన్వీ బిజీగా ఉంది. వీటిలో రూహీ అఫ్జానా త్వరలో రిలీజ్ కి రానుంది.