చినుగుల జీన్స్ కంటే జాన్వీ తాయత్తులపైనే కళ్లన్నీ!

0

అమెరికాలో సిస్టర్ ఖుషీ కపూర్ ని కలుసుకున్న అనంతరం జాన్వీ మాల్దీవుల విహారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. మాల్దీవుల షార్ట్ వెకేషన్ నుంచి అగ్గి రాజేసే ఫోటోషూట్స్ తో యూత్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిచ్చింది. వరుసగా వెరైటీ బికినీలతో అంతర్జాలంపై విరుచుకుపడింది జాన్వీ.

జాన్వి కపూర్ ఇటీవల ఎక్కడికి వెళ్లినా షో స్టాపర్ గా నిలుస్తోంది. ఇప్పుడు మరోసారి విమానాశ్రయంలో కనిపించిన తీరు ఆశ్చర్యపరిచింది. చినుగుల జీన్స్(బ్లూ డెనిమ్స్) లో జాన్వీ కిల్లర్ లుక్ పరేషాన్ చేసింది. క్లాసిక్ వైట్ టీషర్ట్.. రిప్డ్ జీన్స్ తో విమానాశ్రయంలో జాన్వీ కళ్లు తిప్పుకోనివ్వలేదు. అయితే జాన్వీ చినుగుల జీన్స్ కంటే ఆ చేతికి ఉన్న తాయత్తులపైనే జనాల ఫోకస్ ఎక్కువ కనిపించింది. ఈసారి ప్రయాణం ఎక్కడికి అంటే.. మళ్ళీ ఎవరికీ తెలియని గమ్యస్థానానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా విమానాశ్రయానికి రాకముందు జాన్వి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే ఇటీవలే రూహీ రిలీజైంది. జాన్వీ నటనకు గుర్తింపు దక్కింది. ఆమె ఇప్పుడు గుడ్ లక్ జెర్రీ – దోస్తానా 2 లలో కనిపిస్తుంది. గుడ్ లక్ జెర్రీలో జాన్వి పక్కింటి అమ్మాయిగా కనిపిస్తుంది. దీనికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకుడు. దోస్తానా 2 లో కార్తీక్ ఆర్యన్ తోబుట్టువుగా కనిపిస్తుంది.