నిన్న రియల్‌ బ్యూటీ నేడు రీల్‌ బ్యూటీ

0

2006 సంవత్సరంలో మిస్ యూనివర్శ్ శ్రీలంకగా నిలిచిన ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాడెజ్ 2009 సంవత్సరంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అలాడిన్ అనే సినిమాతో హిందీలో పరిచయం అయిన ఈ అమ్మడు తక్కవు సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు టీవీ షోలు మరియు వెబ్ సిరీస్ ల్లో కూడా కనిపించి ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫొటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ కు కన్నుల పండుగ చేసే జాక్వెలిన్ రెండు రోజుల క్రితం మేకప్ లేకుండా ఫిల్టర్ లేకుండా తీసుకున్న సెల్ఫీని షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.

నేచురల్ బ్యూటీ అంటూ ఈ అమ్మడిపై చాలా మంది ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం బాబోయ్ మరీ ఇంతగా మొహంపై మచ్చలు ఉంటే ఎలా కవర్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. ఆ ఫొటోల గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే కొత్త స్టిల్స్ వచ్చాయి. ఈసారి ఈ అమ్మడు మినీ బ్లాక్ డ్రస్ లో థైస్ అందాలను ఆరబోస్తూ నవ్వులు చిందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న రియల్ బ్యూటీ నేడు రీల్ బ్యూటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.