తారక్ కి చిక్కిన రికార్డ్ .. భీమ్ ధామ్ ఆ రేంజులో

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఎంత? టీజర్లు ట్రైలర్లు ఫస్ట్ లుక్ వార్ లో ఎంత దూరంలో ఉన్నాడు? మహేష్ పవన్ చరణ్ ప్రభాస్ వీళ్లకేనా రికార్డులు? తారక్ కి రికార్డుల్లేవా? అంటే.. తాజాగా భీమ్ టీజర్ దుమారం రేపుతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకు లేని నెవర్ బిఫోర్ రికార్డును తారక్ కి అభిమానులు అందించడం చర్చకు వచ్చింది.

కొమరం భీమ్ గా తారక్ లుక్ అభిమానులకు పిచ్చిగా నచ్చేసింది. ఈ టీజర్ కు 1 మిలియన్ లైకులు అందించి తెలుగులో మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ ని సాధించింది. ఈ రేంజు రికార్డు సాఇంచిన మొట్టమొదటి హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచాడు.ఇప్పటికీ ఈ టీజర్ 18 మిలియన్ వ్యూస్ దక్కాయి. యూట్యూబ్ లో రిలీజైనప్పటినుంచి ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. నంబర్ వన్ గా నిలిపేందుకు అభిమానులు తమవంతు హుషారు చూపించారు.

ఎన్టీఆర్ – చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అజయ్ దేవగన్ వేరొక కీలక పాత్రలో నటిస్తుండగా.. ఒలీవియా.. అలియా భట్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. 2021 సమ్మర్ నాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.