కాస్టూమ్ డిజైనర్ తో పూజా ఫన్

0

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే షూటింగ్ సెట్ లో చాలా జోవియల్ గా సరదాగా ఉంటుంది. ఆమె చిత్ర యూనిట్ సభ్యులందరితో కూడా సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసి పోతుందని అంటూ ఉంటారు. రెగ్యులర్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తాను ఏ సినిమా సినిమాలో నటిస్తున్నానో ఆ సినిమా విశేషాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో టచ్ లో ఉండే ఈ అమ్మడు తనకు సన్నిహితంగా ఉండే వారికి సంబంధించిన పుట్టిన రోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటుంది.

పూజా తాజాగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తన కాస్ట్యూమ్ డిజైనర్ ఎకా లఖని వీడియోను షేర్ చేసింది. లఖని డాన్స్ చేస్తూ ఉండగా పూజా హెయిర్ డ్రయ్యర్ పెట్టి ఆమె డాన్స్ ను ఎంకరేజ్ చేస్తూ ఉంది. తనకు ఇది ఫ్యాన్ మూమెంట్ అంటూనే లఖనిని తాను డైరెక్ట్ చేసినట్లుగా ఫన్నీగా ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. లఖని పుట్టిన రోజు సందర్బంగా ఈ వీడియోను షేర్ చేసి హ్యాపీ బర్త్ డే అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈమె రాధేశ్యామ్ సినిమా షూటింగ్ కోసం యూరప్ లో ఉన్న విషయం తెల్సిందే.