వాటర్ బేబి కిర్రెక్కిస్తోందిగా!

0

అవకాశాలు లేని వారికి సోషల్ మీడియా బిగ్ ప్లాట్ ఫామ్ గా మారింది. అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా.. తమ టాలెంట్ ని ముందు పది మందికి తెలియాలన్నా మన టాలెంట్ ని ప్రదర్శించడానికి ఓ వేదిక కావాలి. అలాంటి వేదిక లభించిందా ఇక రచ్చే.. అవకాశాలు లేని వారికి సరిగ్గా అలాంటి వేదికగా మారింది సోషల్ మీడియా. దీంతో ఈ మధ్య అవకాశాలు లేని హీరోయిన్ లు రెచ్చిపోయి ఇంటర్నెట్ ని హీటెక్కించేస్తున్నారు.

ఈ జాబితాలో రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ ఇస్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. చిరుత సినిమాలో నటించిన పదేళ్ల తర్వాత ఈ అమ్మడికి టైమ్ కలిసొస్తోంది అంటే అది సోషల్ మీడియా డిజిటల్ మాధ్యమం పుణ్యమే. ఇప్పటికే స్టార్ హీరోల సరసన ఆఫర్లు అందుకుంటోంది. అందుకు ఫోటోషూట్ ట్రీట్ తో ముందుకొస్తోంది. లాక్ డౌన్ సమయంలో హీటెక్కించే ఫొటోలతో రచ్చచేసిన నేహా తన సోదరితో కలిసి వర్కవుట్ లు చేస్తూ నెటిజన్స్ ని హీటెక్కించిన విషయం తెలిసిందే. ఇదే తంతుని ఈ మద్య మీరీ స్పీడప్ చేసిన నేహాశర్మ తాజాగా ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోలు వైరల్గా మారాయి.

బికినీ ధరించి స్విమ్మింగ్ ఫూల్ లో తడిసిన అందాలతో రెచ్చగొట్టేస్తోంది. వాటర్ బేబి కిర్రెక్కిస్తోందిగా! అంటూ బోయ్స్ ఒకటే కామెంట్లతో చెలరేగిపోతున్నారు. కైపెక్కించే చూపుల్తో గుచ్చి గుచ్చి చంపేస్తోంది. ఈ ఫొటోకి నేహా సిస్టర్ ఈషా శర్మ లవ్ లవ్ లవ్ అంటూ మండుతున్న ఎమోజీలని షేర్ చేస్తూ నేహాశర్మ అందాలపై కామెంట్ చేయడం ఆకట్టుకుంటోంది.