ఎంగేజ్ మెంట్ రింగ్ ను తెగ చూపిస్తున్న చందమామ

0

టాలీవుడ్ చందమామ ఈనెల 30వ తారీకున గౌతమ్ ను వివాహం చేసుకోబోతుంది. వ్యాపారవేత్త అయిన గౌతమ్ తో నిశ్చితార్థం అయినట్లుగా డైరెక్ట్గా ప్రకటించింది. ఎప్పుడు జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాలను కాజల్ రహస్యంగా ఉంచింది. అసలు ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అసలు ఎంగేజ్ మెంట్ జరగలేదేమో డైరెక్ట్ గా పెళ్లికి వీరు రెడీ అయ్యారేమో అంటూ వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కాజల్ తన ప్రతి ఫొటోలో కూడా ఎంగేజ్ మెంట్ రింగ్ కనిపించేలా ఫొటోలకు ఫోజ్ ఇస్తుంది.

పెళ్లి ఖరారు అయ్యంది అంటూ ప్రకటించిన తర్వాత కాజల్ నాలుగు అయిదు ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలన్నింటిలో కూడా కాజల్ తన చేతి వేలికి ఎంగేజ్ మెంట్ రింగ్ ను ప్రదర్శిస్తూనే ఉంది. మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తన ప్రతి ఇన్ స్టా పోస్ట్ లో కూడా చెప్పకనే చెప్పిన ఈ అమ్మడు ఫొటోలతో అభిమానులను అయ్యో అనేలా ఉసూరుమనిపిస్తుంది. కాజల్ పెళ్లి వేడుకలో అతి తక్కువ మంది మాత్రమే పాల్గొనబోతున్నారు. కుటుంబ సభ్యులు మరియు అత్యంత ఆప్తులు మాత్రమే పాల్గొనబోతున్నారు. ఒక ఫామ్ హౌస్ లో సింపుల్ గా కాజల్.. గౌతమ్ ల వివాహం జరుగబోతుంది. కాజల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించబోతున్నట్లుగా ఇప్పటికే చెప్పింది.