వివాహబంధంతో ఒక్కటైన జ్వాలాగుత్తా – విష్ణువిశాల్..!

0

స్టార్ సెలబ్రిటీ కపుల్ తమిళ హీరో విష్ణువిశాల్ -ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలాగుత్తాను గురువారం హైదరాబాద్లో ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నాడు. దాదాపు మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్నటువంటి ఈ స్టార్స్ ఇద్దరూ నేటితో వారి సోలో లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసారు. మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్నప్పటికీ వీరిద్దరూ ఏడాది క్రితమే వారి ప్రేమను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. అప్పటినుండి ఇద్దరూ హాయిగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఎవరి ప్రొఫెషన్ వారు చూసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేశారు. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో జ్వాలాగుత్తా – విష్ణు వారి పెళ్లి ఇన్విటేషన్ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మొత్తానికి అనుకున్నట్లుగానే ఏప్రిల్ 22న హీరో విష్ణువిశాల్ – క్రీడాకారిణి జ్వాలా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నిజానికి పెళ్లి తేదీ ప్రకటించినప్పటి నుండే వీరిద్దరూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చారు. రెండు రోజులుగా వారి ప్రైవేట్ ఎంగేజ్మెంట్ మెహెంది హల్దీ లాంటి వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సెలబ్రిటీ కపుల్ మ్యారేజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ నూతన దంపతులకు సోషల్ మీడియాలో అటు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ నుండి ఇటు ప్రొఫెషన్ ఇండస్ట్రీ నుండి భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేమ వివాహం కదా ఇద్దరూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఇదివరకే వీరిద్దరికీ వేరే వాళ్లతో పెళ్లి అయిపోయింది. వారితో విడాకులు తర్వాత వీరిద్దరూ పరిచయమై అది కాస్తా ప్రేమగా మారి ఈరోజు ఏకంగా పెళ్లి అయిపోయింది. ప్రస్తుతం విష్ణు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.