రెక్కలు తొడిగిన పింక్ గులాబీ

0

అందానికి అందం వేడి పెంచే టెక్నిక్ కొందరికే సాధ్యం. ఈ కోవకే చెందుతుంది హేట్ స్టోరి బ్యూటీ ఊర్వశి రౌతేలా. సినిమాల పరంగా ఎంచుకునే కంటెంట్ తోనే కాదు.. నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలవడం ఎలా అన్నది ఈ భామకు తెలిసినంతగా వేరొక భామకు తెలీదు. అందంతో పాటు సోషల్ మీడియాల్లో వేడి పెంచడం ఎలానో తెలిసిన భామగా ఊర్వశి రౌతేలా పేరు మార్మోగుతోంది.

సాటి నాయికలతో పోలిస్తే ఊర్వశి పబ్లిసిటీ స్టంట్ వేరే లెవల్లో ఉంటోంది. ఇటీవల ఇన్ స్టా వేదికగా ఈ బాలీవుడ్ బ్యూటీ షేర్ చేస్తున్న వరస ఫోటోషూట్లు అంతర్జాలంలో అగ్గి రాజేస్తున్నాయి.

తాజాగా మరో హాట్ ఫోటోషూట్ ని ఊర్వశి షేర్ చేసింది. మిల్కీ వైట్ అందాలను హైలైట్ చేస్తూ పింక్ గులాబీని తలపించే వస్త్రధారణతో మైండ్ బ్లాక్ చేసింది ఊర్వశి. ఒక కొండ రాతిపై నిలుచుని ఊర్వశి ఇచ్చిన ఆ ఫోజు కుర్రకారులోకి దూసుకెళుతోంది. పింక్ లో ఊర్వశి థై సొగసుల ఎలివేషన్ హీట్ పెంచుతోంది. రెక్కలు తొడిగిన పింక్ గులాబీని తలపిస్తోంది ఊర్వశి.. అంటూ కామెంట్లను జోడిస్తున్నారు ఫ్యాన్స్.

గోపిచంద్ సినిమాతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రంలోనూ ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ నంబర్ చేస్తోంది. ఉత్తరాది తో పాటు సౌత్ లోనూ మెరవాలన్న తన కలను నెరవేర్చుకోబోతోంది. ఆ క్రమంలోనే పబ్లిసిటీని పీక్స్ కి చేరుస్తోంది.