భావోద్వేగాల ‘పంచతంత్రం’.. పోస్టర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో!

0

ఎస్ ఒరిజినల్స్ టికెట్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పంచతంత్రం’. హర్ష పులిపాక తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం సముద్రఖని కలర్స్ స్వాతి రాహుల్ విజయ్ నరేష్ అగస్త్య శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్రానికి టైటిల్ ను రీసెంట్ గా ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ ను టాలెంట్ యంగ్ హీరో అడవిశేషు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత సృజన్ ఎరబోలు మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం శివాత్మిక రాజశేఖర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని చెప్పారు. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారని చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఈ చిత్రంతో దర్శకుడిగా ఇంట్రుడ్యూస్ అవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ.. ప్రతీ జీవికి పంచేంద్రియాలు కీలకమైనవని వీటి చుట్టూనే తమ సినిమా కథను అల్లుకున్నట్టు చెప్పారు. చూపు వినికిడి స్పర్శ వాసన రుచి వంటి జ్ఞానేంద్రియాల చుట్టూ తమ సినిమా తిరుగుతుందని తెలిపారు. ఈ ఐదు భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ.. యువత ఆలోచనలకు అద్దం పట్టేలా తమ చిత్రం ఉంటుందని అన్నారు.

అఖిలేష్ వర్ధన్ సృజన్ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తున్నారు. రమేష్ వీరగంధం రవళి కలంగి సహ నిర్మాతలుగా ఉన్నారు.

TAGS: