ఎవరు ఈ పేకాటలో క్వీన్?

0

పరిశ్రమలో మూడు ముక్కలాటలో ఆరితేరిన కథానాయికలెందరో. తెలుగు సినీపరిశ్రమలో అవకాశం దక్కకపోతే తమిళ పరిశ్రమ లేదా కన్నడ మలయాళ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి. అక్కడ పనవ్వకపోతే ఇక్కడ ఇక్కడ కుదరకపోతే అక్కడ అటూ ఇటూ ఆడేస్తుంటారు. ఇదో తరహా మూడు ముక్కలాట.. ఎండ్ లెస్ గేమ్!!

అదంతా సరే కానీ.. ఇక్కడ ఇలా పేక ముక్క చూపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం. పేకాటలో పండిన ముదురు లా క్వీన్(రాణి) నే ఎర వేస్తోంది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఇండ్లలో ఎక్కువగా పేకాటే ఆడుతున్నారు. అన్నట్టు.. ఈ రియాలిటీ పేకాటలో క్వీన్ ఎవరో కానీ…! ఈ క్రియేటివ్ ఫోటోగ్రఫీ నిజంగానే యువతరంపై మ్యాజిక్ చేస్తోంది.

ఇంతలోనే ఈ ఫోటోలో ఉన్న క్వీన్ ఎవరో కనిపెట్టేశాం. పేరు తేజస్వి మాదివాడ. ఐస్ క్రీమ్ పిల్ల. ఆర్జీవీ ఇచ్చిన ఆఫర్ తో కథానాయిక అయ్యింది. ఇటీవల వరుసగా సినిమాలు చేస్తున్నా కానీ మహమ్మారీ వల్ల అవేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం కమిట్ మెంట్ అనే సినిమాలో తేజస్వి నటించింది. ఇండస్ట్రీ కమిట్ మెంట్స్ నేపథ్యంలో వేడెక్కించే పాత్రలో దర్శనమీయనుంది. ఇంతకుముందు కమిట్ మెంట్ పోస్టర్లు వేడెక్కించాయి.

అన్నట్టు ఇటీవల చిట్టి పొట్టి నిక్కర్లతో అగ్గి రాజేస్తున్న తేజస్వి మరోమారు ఈ ఫోటోషట్లోనూ ఆ రేంజులోనే చెలరేగింది. డెనిమ్ నిక్కరుకు కాంబినేషన్ డ్రెస్ లో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. అయితే ఆ పేక ముక్కను అడ్డు పెట్టుకుని కుర్రాళ్లను ఇలా టీజ్ చేయడం సరికాదని కొందరు అలకబూనారు. ఇటీవల బికినీ ఫోటోషూట్ తో మంటలు పుట్టించిన ఈ బ్యూటీ ఇంతలోనే ఇలా కొత్త ఫోటోషూట్ తో దూసుకురావడం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.