పనైపోయిందనుకున్న ప్రతిసారి కుమ్మేస్తూనే ఉంది!

0

చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతూనే ఉన్న విషయం తెల్సిందే. కొన్ని సంవత్సరాల క్రితం ఈ అమ్మడి పనైపోయింది. ఈమెకు ఆఫర్లు రావడం కష్టమే. సీనియర్ లకు తప్ప ఈమె యంగ్ హీరోలకు అవసరం లేదు అంటూ కామెంట్స్ చేశారు. అలాంటి సమయంలో వరుసగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి స్టార్స్ కు జోడీగా నటించి మళ్లీ పుంజుకుంది. ఇక గత ఏడాది కాజల్ అగర్వాల్ కు ఆఫర్లు రాకపోవడంతో అమ్మడి కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది అంటూ ప్రచారం జరిగింది.

ఈసారి కూడా కాజల్ కుమ్మేస్తోంది. ఒక వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రంలో నటించడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఎంపిక అయ్యింది. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ సూపర్ స్టార్ విజయ్ కు జోడీగా ఈమెను మురుగదాస్ ఎంపిక చేశాడంటూ సమాచారం అందుతోంది. మరో వైపు ఒక భారీ వెబ్ సిరీస్ కు కమిట్ అవ్వడంతో పాటు రెండు చిన్న చిత్రాల్లో కూడా కాజల్ నటిస్తూనే ఉంది.

ఇలా బిజీ బిజీగా ఈ అమ్మడు వరుస చిత్రాలు చేయడంతో మరో రెండు మూడు సంవత్సరాల వరకు ఈమె స్టార్ డం కొనసాగడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఇంత ఎక్కువ కాలం స్టార్ గా నిలవడం అది కేవలం కాజల్ కు మాత్రమే సాధ్యం అయ్యింది అంటూ ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.