ప్రతిభ ఉంటేనే ఇక్కడ చోటు : రకుల్

0

సుశాంత్ రాజ్ పూత్ మృతి తర్వాత నెపొటిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా పరిశ్రమతో పాటు అన్ని చోట్ల కూడా నెపొటిజం అనేది ఉంది. కాని బాలీవుడ్ లో నెపొటిజం అనేది చాలా ఎక్కువగా ఉందని కొందరు ఒక వర్గంగా ఏర్పడి బయటి వారిని బాలీవుడ్ లో అడుగు పెట్టకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కంగనా వంటి వారి విమర్శలు. అయితే కొందరు మాత్రం ప్రతిభ ఉంటే ఖచ్చితంగా ఆఫర్లు వస్తాయి అంటున్నారు. తాజాగా ఈ విషయమై సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఒక ఇంగ్లీష్ దిన పత్రికతో రకుల్ మాట్లాడుతూ… ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం అనేది కొందరికి కష్టం అవుతుంది మరికొందరికి సులువు అవుతుంది. కాని ఇద్దరు కూడా కష్టపడితేనే గుర్తింపు వస్తుంది. ఈజీగా ఎంట్రీ దక్కినంత మాత్రాన కష్టపడకుండానే స్టార్స్ అవ్వరు. ఎవరు ఏం మాట్లాడినా కూడా చివరకు ఇండస్ట్రీలో ఫేట్ ను నిర్ణయించేది ప్రేక్షకులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకులను మెప్పించిన వారికే ఇక్కడ ఛాన్స్ ఉంటుందని రకుల్ చెప్పుకొచ్చింది. అది వారసులు అయినా బయట నుండి వచ్చిన వారు అయినా ప్రేక్షకుల తీర్పును బట్టి కెరీర్ ఉంటుందని పేర్కొంది.

టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో మూడు సంవత్సరాలు చాలా బిజీ హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కాస్త డల్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా ఈమె ఒకటి రెండు సినిమాలు చేసింది. ప్రస్తుతం అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు మళ్లీ పుంజుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.