తమన్ ‘ఆల్బమ్ ఆఫ్ ది డికేడ్’ ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్…!

0

సౌత్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. వరుసగా క్రేజీ మూవీస్ కి అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. సాంగ్స్ తో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా అంతటి విజయం సాధించడానికి తమన్ అందించిన సంగీతం ఎంతగా దోహదపడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా వచ్చి ఏడు నెలలు అవుతున్నా పాటల సందడి మాత్రం ఆగడం లేదు. కవర్ సాంగ్స్ తో టిక్ టాక్ వీడియోలతో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి.

అయితే ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ బీజీఎమ్ ని రెడీ చేస్తున్నాడు థమన్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. ‘అల వైకుంఠపురములో’ బీజీఎమ్ జ్యూక్ బాక్స్ వర్క్ స్టార్ట్ అయింది. ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్ ని ఈ డికేడ్ లో బెస్ట్ ఆల్బమ్ గా చేసినందుకు థ్యాంక్స్. ఇప్పుడు మేము బీజీఎమ్ జ్యూక్ బాక్స్ ని విడుదల చేసే పనిలో ఉన్నాము అని చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ డికేడ్ స్టార్ట్ అయి 9 మంత్స్ కూడా కంప్లీట్ అవలేదు.. నువ్వు అప్పుడే మరో 10 ఇయర్స్ ఇలాంటి ఆల్బమ్ మరొకటి రాదంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం డికేడ్ స్టార్టింగ్ లో ఇలాంటి ఆల్బమ్ అని పెట్టబోయి.. ఆల్బమ్ ఆఫ్ ది డికేడ్ అని పొరపాటున ట్వీట్ చేసి ఉంటాడులే అని సమర్ధిస్తున్నారు. మరికొందరు డికేడ్ అనేది మనం ఇష్టం మొచ్చినట్లుగా కాలిక్యులేట్ చేసుకోవచ్చని కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉండగా తమన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’.. సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’.. రవితేజ ‘క్రాక్’ చిత్రాలకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. అంతేకాకుండా బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా.. నాని ‘టక్ జగదేశ్’.. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాకి కూడా తమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఇక కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ మూవీకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.