కాజల్ అగర్వాల్ కి కాబోయే వరుడు ఇతడేనా! ?

0

కరోనా కరోనా లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని.. ఇప్పటికే రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని.. ఈ ఏడాది పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉందని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని పుకార్లు షికారు చేసాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా పింక్ విల్లా తాజాగా కాజల్ నిశ్చితార్థం మరియు పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

కాగా బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని త్వరలోనే వివాహం చేసుకోనుందని తెలుస్తోంది. వెడ్డింగ్ సూత్రం కథనం ప్రకారం త్వరలో కాజల్ – గౌతమ్ ల పెళ్లి తేది కూడా ఖరారు చేయనున్నారట. ఈ వివాహం ముంబైలోలోని చర్చ్ గేట్ లో కాజల్ ఇంటికి దగ్గరగా ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ లో రెండు రోజుల వేడుకగా జరుగనుందని.. లాక్ డౌన్ తర్వాత జరగబోయే మొదటి సెలబ్రిటీ వివాహం ఇదేనని పేర్కొంది. గౌతమ్ కిచ్లు ఒక ఇంటీరియర్ డిజైనర్. గతకొద్ది కాలంగా గౌతమ్ ఫ్యామిలీ హోం ఫర్నిషింగ్ బిజినెస్ లో ఉందని సమాచారం. అయితే దీని గురించి కాజల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. మరి పెళ్లి వార్తలపై చందమామ కాజల్ ఎలా స్పదిస్తుందో చూడాలి.