పవర్ స్టార్ తో కన్నడ సూపర్ స్టార్ భేటీ దేనికో మరి…!

0

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ సమావేశమయ్యారు. ఈరోజు(సోమవారం) ఉదయం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కలిసిన సుదీప్.. పవన్ కళ్యాణ్ కు మొక్కలను బహూకరించారు. అయితే శాండిల్ వుడ్ హీరో సుదీప్ ఇప్పుడు అనుకోకుండా పవన్ కళ్యాణ్ కలవడం అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. కరోనా సమయంలో వీరిద్దరి సమావేశానికి ప్రత్యేక ఉద్దేశ్యమేమైనా ఉందా.. లేదా మర్యాదపూర్వకంగా కలిశారా అనే ఊహాగానాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో సుదీప్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా డిస్కషన్ జరుగుతోంది.

పవన్ – సుదీప్ మధ్య సుమారు గంట సేపు వివిధ అంశాలపై సంభాషణ సాగినట్లు తెలుస్తోంది. కరోనా అన్ లాక్ నేపథ్యంలో సినిమా చిత్రీకరణలు మొదలవడం గురించి.. అలాగే వర్తమాన సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే తాను నటిస్తున్న సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయడం గురించి పవన్ కు సుదీప్ వివరించారు. కాగా పవన్ కళ్యాణ్ – కిచ్చా సుదీప్ ఇద్దరూ సెప్టెంబర్ 2న జన్మించారనే విషయం తెలిసిందే. ఈ మధ్య జరిగిన బర్త్ డే నాడు ఇద్దరూ పరస్పరం శుభాకాంక్షలు కూడా చెప్పుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘అత్తారింటికి దారేది’ సినిమాని సుదీప్ ‘రన్నా’ పేరుతో కన్నడలో రీమేక్ చేశాడు. అలానే ప్రభాస్ ‘మిర్చి’ సినిమాని రీమేక్ చేసాడు. తెలుగులో ‘ఈగ’ ‘బాహుబలి’ ‘రక్త చరిత్ర 2’ వంటి సినిమాలలో సుదీప్ నటించాడు.