‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్ వచ్చేస్తోందోచ్…!

0

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంటిన్యూగా రెండు నెలలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నామని ప్రకటించిన రాజమౌళి.. చిత్రీకరణ మొదలుపెట్టేశాడు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. అలా షూటింగ్ స్టార్ట్ చేసాడో లేదో ఇలా వెంటనే ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి రేపు(మంగళవారం) అప్డేట్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ”మమ్మల్ని తిట్టడంలో మీ అసమానమైన సృజనాత్మకత పోస్టులు ఇక చాలు. మీ ప్రేమతో మమ్మల్ని ఉత్తేజ పర్చినందుకు ధన్యవాదాలు. సమయం గడిచింది. చివరకు ఆ క్షణం వచ్చేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మా వంతు. రేపటి కోసం వేచి ఉండండి” అంటూ ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ ట్వీట్ చేసింది.

కాగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ నుంచి ఇప్పటికే ‘అల్లూరి సీతారామరాజు’గా చరణ్ ఇంట్రో వీడియో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ‘కొమరం భీమ్’ తారక్ ఫస్ట్ లుక్ వీడియో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ చేసిన ట్వీట్ ‘రామరాజు ఫర్ భీమ్’ గురించే అని అనిపిస్తోంది. ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ – అలియా భట్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు.