మాలీవుడ్ పై కన్నేసిన స్టార్ హీరోయిన్…?

0

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ కెరీర్ స్టార్ట్ చేసి పన్నెండేళ్ళు అవుతున్నా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తోంది. ప్రస్తుతం అరడజనుకి పైగా ఆఫర్స్ చేతిలో పెట్టుకున్న కాజల్.. కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ అదరగొడుతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాతో పాటు మంచు విష్ణు ‘మోసగాళ్లు’ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక తమిళంలో కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఇండియన్ 2’ మరియు ‘హే సినామికా’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో ‘ముంబయి సాగా’ అనే సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో ‘లైవ్ టెలికాస్ట్’ అనే తమిళ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఓటీటీ వరల్డ్ లో సత్తా చాటడానికి ప్లాన్స్ వేసుకుంది. ఇలా తెలుగు తమిళ హిందీ ఇండస్ట్రీలలో హవా చూపిస్తున్న కాజల్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీపై కన్నేసిందని తెలుస్తోంది.

కాగా కాజల్ అగర్వాల్ టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ లలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిందని సమాచారం. మలయాళ స్టార్ హీరోలైన పృథ్వీరాజ్ – ఫాహద్ ఫాజిల్ సరసన నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తిగా యాక్షన్ స్కోప్ ఉన్న మల్లూ స్టోరీలను మాత్రమే కాజల్ ఒప్పుకుంటున్నట్లుగా కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నయనతార – త్రిష – కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్స్ మలయాళ ఇండస్ట్రీలో కూడా తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా మాలీవుడ్ లో అడుగులు వేయాలని చూస్తోంది. మరి అమ్మడి కెరీర్ అక్కడ సక్సెస్ ఫుల్ గా సాగుతుందో లేదో చూడాలి.