కాజల్ సోదరి ఫ్యామిలీ ఫోటో అదిరిందిగా..!

0

అక్కాచెల్లెళ్ల అనుబంధం గురించి మాట్లాడాలంటే ముందుగా కాజల్ – నిషా అగర్వాల్ సిస్టర్స్ అన్యోన్యతను తలచుకోవాల్సిందే. సోదరి నిషా అంటే కాజల్ కి పంచప్రాణాలు. ఆ ఇద్దరి మధ్యా బాండింగ్ ఎంతో అపురూపం. నేడు సోదరి నిషా అగర్వాల్ పుట్టినరోజున కాజల్ అగర్వాల్ అందమైన ఫోటోలతో శుభాకాంక్షలు తెలిపింది. నా హృదయ స్పందనకు పుట్టినరోజు శుభాకాంక్షలు!! అంటూ నిషాపై ప్రేమను కురిపించింది కాజల్. ఇక ఇందులో నిషా అగర్వాల్ హబ్బీ సహా వారసురాలితో కలిసి ఇచ్చిన ఫోజు జోరుగా వైరల్ అవుతోంది.

మొన్ననే అక్క కాజల్ అగర్వాల్ బ్యాచిలొరెట్ పార్టీని జరుపుకోవడానికి నిషా ఎంత హంగామా చేసిందో తెలిసినదే. ఇక నిషా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే.. ఇంతకుముందు తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. వరుణ్ సందేశ్ .. నారా రోహిత్ లాంటి యువహీరోల సరసనా ఆడిపాడింది. ఆ తర్వాత కెరీర్ ఆశించిన రేంజుకు చేరకపోవడంతో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది.

ముంబైకి చెందిన వ్యాపారవేత్త కరణ్ వలేచాను 2013 డిసెంబర్ 28 న పెళ్లాడింది నిషా. వరుణ్ సందేశ్ – నిషా జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా `ఏమైంది ఈవేళ` బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. తదుపరి చిత్రం సోలో. నారా రోహిత్- నిషా అగర్వాల్ జంటకు ఇది బ్లాక్ బస్టర్ మూవీ. 2011 చివరిలో ఈ మూవీ విడుదలైంది .ఇందులో నిషా మెడికల్ కాలేజీ విద్యార్థిగా నటించగా రోహిత్ వీర ప్రేమికుడిగా కనిపించాడు. ఆ తర్వాత ఏమైంది ఈవేళ రీమేక్ `ఇష్టం` (2012) చిత్రంతో నిషా తమిళంలో అడుగుపెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. 2013 లో సుకుమరుడులో నటించింది. భయ్య భయ్య తో మలయాళ చిత్ర పరిశ్రమలోనూ ప్రవేశించింది. అటుపై చివరిసారిగా మలయాళ చిత్రం కజిన్స్ లో కనిపించింది. నిషా అగర్వాల్ పెళ్లి చేసుకున్న తర్వాత నటనను విరమించాలని నిర్ణయించుకుంది. 27 అక్టోబర్ 2018 న ఈ జంటకు ఇషాన్ వలేచ అనే కుమారుడు కలిగాడు.