`ఖిలాడి` రాజా పై కె.ఎల్.యూనివర్శిటీ అధినేత క్లాప్

0

రవితేజ క్రాక్ (#RT66) చిత్రీకరణ పెండింగ్ పనులు పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కొత్త ప్రాజెక్ట్ ఖిలాడీ (#RT67) ప్రారంభమైంది. మాస్ రాజా నటిస్తున్న 67వ చిత్రమిది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యింది. నేడు హైదరాబాద్ లో కె.ఎల్.యూనివర్శిటీ యువ సీఈవో కం హీరో హవీష్ క్లాప్ నివ్వగా ఖిలాడీ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీను కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభియం చేయనున్నారు. మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్నారు. రాక్షసుడు ఫేం రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఖిలాడి వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ కార్యక్రమంలో రవితేజ-హవీష్ సహా దర్శకుడు రమేష్ వర్మ.. ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఏ స్టూడియోస్ ఎల్.ఎల్.పి- పెన్ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. లాంచింగ్ వేడుకలో మాస్ రాజాతో పాటు హీరో కం నిర్మాత హవీష్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆయన విజయవాడలోని ప్రఖ్యాత సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ కె.ఎల్ వర్శిటీ అధినేత వారసుడు అన్న సంగతి విధితమే. కె.ఎల్ యూనివర్శిటీ కొత్త బ్రాంచీని హైదరాబాద్ లోనూ ప్రారంభించారు.