మరోసారి మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్

0

టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియా రికార్డులు.. యూట్యూబ్ వ్యూస్ లైక్స్ రికార్డుల వెంట పరుగులు పెడుతున్నారు. ఆమద్య పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ తో రికార్డు సృష్టించారు. ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుని బాబోయ్ తెలుగు హీరోల ఫ్యాన్స్ మామూలు వాళ్లు కాదు అనిపించుకున్నారు. మెగా.. నందమూరి.. మహేష్ బాబు ఫ్యాన్స్ మద్య పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఈ దసరాకు మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ మద్య మరో సోషల్ మీడియా వార్ జరుగబోతున్నట్లుగా అనిపిస్తుంది.

నందమూరి అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఎన్టీఆర్ వీడియోను విడుదల చేయబోతున్నారు. రామరాజు ఫర్ భీమ్ వీడియోను ఈనెల 22న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం కౌంట్ డౌన్ ను మొదలు పెట్టిన నందమూరి ఫ్యాన్స్ ట్విట్టర్ లో అత్యధిక ట్వీట్స్ చేయడంతో పాటు యూట్యూబ్ లో ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూస్ తో పాటు ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ మరియు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టి ఎన్టీఆర్ కు దసరా కానుకగా ఇవ్వాలంటూ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. అదే విధంగా పవన్ అభిమానులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు.

పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. టీజర్ ను దసరా కానుకగా విడుదల చేయడం కోసం దసరాకు ముందే పవన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఖచ్చితంగా దసరాకు వకీల్ సాబ్ టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ టీజర్ కు కూడా యూట్యూబ్ లో రికార్డుల మోత మ్రోగించాలని భావిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ దసరా వార్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.