హృతిక్ రోషన్ .. కరణ్ జోహార్ మొదలు ఓ ఏడుగురి పేర్లు ఎత్తితే కంగన అగ్గిమీద గుగ్గిలమే అవుతుంది. క్వీన్ కి ఒళ్లంతా సలసలా కాగిపోతుంది. సదరు బాలీవుడ్ ప్రముఖులపై కంగన నిరంతరం ఫిరంగి దాడులతో విరుచుపడడం చూస్తున్నదే. ఇంతకీ ఎవరా ఏడుగురు? ఏమా ఏడు చేపల కథ?
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అనంతరం ఇటీవల మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలతో ఆమెకు ఎలాంటి కౌంటర్లు మొదలయ్యాయో చూస్తున్నాం. ఈ ఘటనల తర్వాత కంగనా రనౌత్ తిరిగి ఆ ఏడుగురిపై దృష్టి సారించారని అర్థమవుతోంది.
కంగనా రనౌత్ `మణికర్ణిక`లో ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మి బాయిగా నటించారు. వీరనారిగా నటించాక కంగన దూకుడు స్వభావం రెట్టింపైంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత కంగనాలో ఈ లక్షణం పీక్స్ కి చేరుకుంది. పలువురు పురుష పుంగవులపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా కంగన బహిరంగంగా పోరాడిన ప్రముఖ వ్యక్తుల పేర్లు హైలైట్ అయ్యాయి.
కంగనా లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఉర్మిలను ఓ రేంజులో టార్గెట్ చేసింది. శృంగార తార అంటూ తిట్టేసింది. ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని BMC కూల్చివేశాక “ఉద్ధవ్ థాకరే తుజే క్యా లగ్తా హై? (మీరు ఏమనుకుంటున్నారు?) మీరు ఫిల్మ్ మాఫియాతో ఒప్పందం కుదుర్చుకుని .. నా ఇంటిని కూల్చివేసి నాపై ప్రతీకారం తీర్చుకున్నారా? మీ అహంకారం రేపటి రోజున మిగలదు“ అంటూ థాక్రేపై విరుచుకుపడింది. ముంబైని మరో POK తో పోల్చింది క్వీన్. కంగనా రనౌత్ డ్రగ్స్ కనెక్షన్ కు వ్యతిరేకంగా అధ్యాయన్ సుమన్ మాట్లాడితే అతడిపై మాటల తూటాలు కూరి చివరిగా ఫిరంగులు విసిరింది.
క్రిష్ 3 చిత్రీకరణ సమయంలో కంగనతో హృతిక్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత హృతిక్ తో రాకేష్ రోషన్ తో కంగన ఫికర్ తెలిసినదే. కోర్టు గొడవల వరకూ వెళ్లింది. హృతిక్ కుటుంబ జీవితంలో కలతలు అప్పుడే బహిర్గతం అయ్యాయి.
ఇక కరణ్ జోహార్ అంటే కంగన ఒళ్లు మంట. కాఫీ విత్ కరణ్ లో కనిపించిన కంగన కరణ్ జోహార్ ను స్వపక్షపాతం .. మూవీ మాఫియా జెండా మోసే వ్యక్తి అని కౌంటర్లతో సతాయించేసింది. “నా బయోపిక్ ఎప్పుడైనా తెరకెక్కిస్తే మీకు తెలిసిన ఆ మూస బాలీవుడ్ బిగ్గీస్ ని ఆటాడతాను“ అంటూ పంచ్ లు వేసింది కంగన.
ఇటీవల రాజ్యసభ ప్రసంగంలో జయ బచ్చన్ మాట్లాడుతూ వినోద పరిశ్రమను సోషల్ మీడియా కొట్టిపారేస్తోందని దానిని రక్షించి మద్దతు ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరింది. “జిస్ థాలి మెయిన్ ఖాటే హై ఉస్మే ఛేడ్ కర్తే హై గాలత్ బాత్ హై ” అని చెప్పింది. దీనిపై స్పందిస్తూ కంగనా ట్విట్టర్ లో చెలరేగింది.
“మీరు జయ జిని ఏ ప్లేట్ గురించి ప్రస్తావిస్తున్నారు? ఒక థాలి (ప్లేట్) ఇచ్చారు. దీనిలో రెండు నిమిషాల పాత్ర.. ఐటెమ్ నంబర్లు .. శృంగార సన్నివేశం ఛాన్సులే దక్కాయి. అది కూడా హీరోతో ఒక రేయి నిదురించాక వచ్చిన ఆఫర్లు అవి. నేను చిత్ర పరిశ్రమకు స్త్రీవాదం నేర్పించాను.. దేశీయ చిత్రాలతో ‘తాలి’ అలంకరించాను. ఇది నా సొంత ప్లేట్ జయ జీ.. ఇది మీది కాదు“ అంటూ పోయెటిక్ గా విరుచుకుపడింది.
రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనంగా తాప్సీ పన్నూ.. స్వరా భాస్కర్ లను బి-గ్రేడ్ నటీమణులు అంటూ కామెంట్ చేసింది. “నేను ఇక్కడ మాత్రమే ఓడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు వారు (మూవీ మాఫియాని సూచిస్తూ) తాప్సీ పన్నూ.. స్వరా భాస్కర్ వంటి 20 మందిని లాక్కుంటారు అంటూ పంచ్ లు వేసింది కంగన.
ఇక ప్రతిసారీ యష్ రాజ్ ఫిలింస్ అధినేత పైనా కంగన నిరంతరం విరుచుకుపడడం చూస్తున్నదే. చోప్రాలు అంటే కంగన భగభగ మండిపోతుంది. అలియా భట్ .. అనన్య పాండే లాంటి నటీమణులపైనా కంగన పదే పదే చురకలు వేస్తూనే ఉంటుంది. ఇలా చూస్తే ఏడుగురు కంగనకు బద్ధ శత్రువులు ఉన్నారని అర్థమవుతోంది. అయితే కంగన నోటి దురుసుకు పలువురు దర్శకరచయితలు నిర్మాతలు కూడా శత్రువులుగా మారిన వైనం తెలిసిందే. వారితో పార్ట్ టైమ్ గొడవలు తప్ప ఫుల్ టైమ్ ఇలా విరుచుకుపడేది లేదు.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
